Starlink Internet India Price Per Month | స్టార్‌లింక్ ఇండియా సోమవారం నాడు తమ ప్లాన్‌ల ధరలను ప్రకటించిందని వార్త వచ్చింది. అయితే, కంపెనీ ఆ వార్తలను ఖండించింది. స్టార్‌లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ మాట్లాడుతూ.. ఇది ఎగ్జామిన్ డేటా అని, వెబ్‌సైట్‌లో టెక్నికల్ ప్రాబ్లం కారణంగా ప్రజలకు ఆ ధరలు తెలిశాయని అన్నారు. భారత కస్టమర్‌ల కోసం ఇంకా సర్వీస్ ధరలను స్టార్ లింక్ ప్రకటించలేదు. భారతదేశంలో స్టార్‌లింక్ ప్రారంభం కోసం ప్రజలు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు.
స్టార్ లింక్ కంపెనీ చెప్పిందంటే..
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ భారతదేశంలో తమ రెసిడెన్షియల్ ప్లాన్‌ల అధికారిక ధరలను సోమవారం విడుదల చేసిందని అనేక నివేదికలు తెలిపాయి. అయితే, ఈ నివేదికలను స్టార్ లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ ఖండించారు. భారతదేశంలో స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్ ఇంకా లైవ్ కాలేదని, ఇంకా సర్వీస్ ధరలను ప్రకటించలేదని స్పష్టం చేశారు. కంపెనీ ఇంకా భారతదేశంలో కస్టమర్‌ల నుండి ఆర్డర్‌లను కూడా తీసుకోలేదని ఆమె Xలో పేర్కొంది. "కాన్ఫిగరేషన్ లోపం కారణంగా వెబ్‌సైట్‌లో డమ్మీ టెస్ట్ డేటా లీక్ అయిందని, కానీ ఇది భారతదేశంలో స్టార్‌లింక్ సర్వీస్ ధర కాదని తెలిపారు. భారతదేశంలో తమ సర్వీస్‌ను, వెబ్‌సైట్‌ను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఆమె చెప్పారు.
వెబ్‌సైట్‌లో ధరలు ఎంత చూపించాయి..
స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్‌లో సోమవారం కనిపించిన అప్‌డేట్ ప్రకారం, రెసిడెన్షియల్ ప్యాకేజీ నెలకు ఖర్చు రూ.8,600 అవుతుంది. చందాదారులతోపాటు, వినియోగదారులు రూ.34,000 వేలతో హార్డ్‌వేర్ కిట్ ఒకసారి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భారత్‌కు సమీపాన ఉన్న భూటాన్‌లో స్టార్‌లింక్ ధర (హార్డ్‌వేర్ మినహా): స్టార్‌లింక్ రెసిడెన్షియల్: నెలకు BTN 4,200 (సుమారు రూ. 4,211), స్టార్‌లింక్ రెసిడెన్షియల్ లైట్: నెలకు BTN 3,000 (సుమారు రూ. 3,007) చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు భారత దేశంలో అమలు చేయబోయే ప్లాన్‌లు భూటాన్ ధరలతో పోల్చితే చాలా ఖరీదైనవిగా ఉన్నాయని డిసెంబర్ 8న చర్చ జరిగింది. భారతదేశంలోని నగరాల్లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులో లేవు. కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాని కారణంగా అధికారికంగా ఎక్కడా ప్రారంభంచలేదు. వెబ్‌సైట్‌లో ఇదే విషయం స్పష్టం చేసినా, ధరలు ప్రకటించిన ప్రజలు ధరలు చూసి షాకయ్యారు.
మరింత పెరిగిన కస్టమర్‌ల నిరీక్షణ
కంపెనీ ఈ వివరణ ఇచ్చిన తర్వాత, స్టార్‌లింక్ Internet సర్వీస్‌ల కోసం ఎదురు చూస్తున్న కస్టమర్‌ల నిరీక్షణ మరింత పెరిగింది. ఉపగ్రహ ఇంటర్నెట్‌ను అందించే ఈ కంపెనీ ట్రయల్స్ పూర్తయ్యాయని, త్వరలో భారతదేశంలో సర్వీస్‌ను ప్రారంభించడానికి అనుమతి తీసుకోనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కంపెనీ బెంగళూరు కార్యాలయానికి ఉద్యోగుల నియామకాలను కూడా వేగవంతం చేసింది. స్టార్‌లింక్‌కు భారతదేశం ఒక ముఖ్యమైన మార్కెట్ అని, ఇక్కడ గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంలో స్టార్‌లింక్ కీలక పాత్ర పోషిస్తుందని ఎలాన్ మస్క్ నమ్ముతున్నారు.