Otrovert Personality Explained : సోషల్ మీడియాలో వ్యక్తిత్వాన్ని తెలిపేలా లేబుల్స్ ఉంటాయి. ఇంట్రోవర్ట్, ఎక్స్​ట్రోవర్ట్, ఆంబ్రివర్ట్ లాంటివి వింటూనే ఉంటాము. చాలామంది వాటిని తమ సోషల్ మీడియా ప్రొఫైల్​లో కూడా పెట్టుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో వ్యక్తిత్వాన్ని సూచించే కొత్త లేబుల్ వచ్చింది. అదే “ఒట్రోవర్ట్”. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇది బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది ఇంట్రోవర్ట్స్, ఎక్స్​ట్రోవర్ట్స్ వంటి ద్వంద్వత్వాన్ని సవాలు చేస్తోంది. ఈ పదం ప్రవర్తనా ప్రాధాన్యతల సందర్భం, వాతావరణం, భావోద్వేగ స్థితిని బట్టి మారుతూ ఉండే వ్యక్తులను వివరించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారట. అంటే ఇది ఏ రకమైన టీమ్​లో ఉండదు. అదో రకం అన్నట్టు. 

Continues below advertisement

చాలాకాలంగా ఇంట్రోవర్ట్స్​ని ఒంటరితనంతో రీఛార్జ్ చేసుకునే వ్యక్తులుగా, ఎక్స్​ట్రోవర్ట్స్​ని సామాజికంగా కలిసిపోయే వ్యక్తులగా ప్రపంచం చూపిస్తుంది. ఈ రెండింటినీ మిక్స్ చేస్తూ.. పరిస్థితులకు తగ్గట్లు మారిపోవడాన్ని “ఒట్రోవర్ట్” అంటూ ప్రచారం చేస్తుంది. దీనిలో ఇంట్రోవర్ట్, ఎక్స్​ట్రోవర్ట్ లక్షణాలు కనిపిస్తాయి. గతంలో “అంబివర్ట్” అనేది దీనికోసమే వచ్చింది. కానీ భిన్నంగా రెండు తీవ్రతల మధ్య మరింత స్పష్టమైన మూడ్ స్వింగ్‌లను అనుభవించే వ్యక్తులను వివరించడానికి “ఒట్రోవర్ట్” ఉపయోగిస్తున్నారు.

'ఒట్రోవర్ట్' ఎవరు?

డాక్టర్ రామి కమన్‌స్కీ రూపొందించిన 'ఒట్రోవర్ట్' అనే పదం స్పానిష్ (మూలం లాటిన్ నుంచి వచ్చింది), “ఒట్రో” అంటే “ఇతర”, లాటిన్ మూలం కలిగిన “వర్ట్” అంటే “తిరగడం” అని అర్థం. జెన్నిఫర్ చేజ్ ఫిన్చ్ ప్రకారం.. "ఒక “ఒట్రోవర్ట్” “ఇతరత్వం” వ్యక్తిత్వ లక్షణాన్ని కలిగి ఉంటాడు. భాష ద్వారా ఒంటరితనం నుంచి సామాజిక సంబంధానికి మానవత్వం మారేటప్పుడు ఒక శాశ్వతమైన వ్యక్తిగా మిగిలిపోతాడు." అని చెప్పారు.

Continues below advertisement

ఒట్రోవర్ట్‌లు ఒక ప్రత్యేకమైన సంబంధ శైలిని కలిగి ఉంటారు. సహజంగానే స్నేహానికి మొగ్గు చూపుతారు. అయినప్పటికీ.. వారి స్థానంలో లేని భావన. “ఒకలా కనిపించడం, నటించడం మధ్య వ్యత్యాసాన్ని ఇది సూచిస్తుంది. ఎక్కువ సేపు ఇంట్రోవర్ట్​గా, ఎక్స్​ట్రోవర్ట్​గా ఉండలేరు.” ఈ ధోరణిని గమనిస్తున్న మానసిక ఆరోగ్య నిపుణులు.. ఈ పదానికి పెరుగుతున్న ప్రజాదరణ ప్రజలు గుర్తింపు, ప్రవర్తనను ఎలా అర్థం చేసుకుంటారనే మార్పును ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు. వ్యక్తిత్వ లేబుల్‌లు వారి జీవన వాస్తవికతను ప్రతిబింబిస్తాయని భావించడం లేదు. ట్రెండ్​లో ఉన్నవాటినే తమ లక్షణాలుగా భావించే దానినే లైక్ చేస్తున్నట్లు చెప్తున్నారు. 

'ఒట్రోవర్ట్స్' కోసం సోషల్ మీడియా బూస్ట్

ఈ పదం పెరగడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. వీడియో ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ ఫోరమ్‌లు వారి “ఒట్రోవర్ట్” ధోరణులను వివరిస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. పెద్ద గ్రూప్స్​లో నెట్‌వర్క్ చేయగలరు. లేదా ఫాలోవర్స్ కోసం కంటెంట్‌ను క్రియేట్ చేయగలరు. కానీ భావోద్వేగపరంగా అలసిపోయి రోజులు తరబడి కమ్యూనికేషన్ నుంచి దూరంగా ఉంటారు. ఈ ధోరణికే ఒట్రోవర్ట్స్ అనే పేరు పెట్టారు.

అయితే “ఒట్రోవర్ట్” అనేది ఇంకా వైద్యపరంగా లేదని మానసిక నిపుణులు చెప్తున్నారు. అధికారిక రోగనిర్ధారణ మాన్యువల్స్‌లో కనిపించదని.. అకాడెమిక్ పరిశోధన ఇప్పటికీ వ్యక్తిత్వ ఫ్రేమ్‌వర్క్‌లపై ఆధారపడి ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ  దీనిని లేబుల్‌ల్​గా తీసుకోవచ్చని అంటున్నారు. ఈ పదం ట్రెండ్ అవ్వడం పక్కన పెడితే దీని గురించి జనాలకు పూర్తి అవగాహన వస్తే బాగుంటుందని అలాంటప్పుడు అది మిస్ యూజ్ కాదని అంటున్నారు.