Speed signs at every 10km on National Highways soon | న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాలకు కారణం అతివేగం, లేన్ ఉల్లంఘించడమే ప్రధాన కారణమని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్ వే, జాతీయ రహదారుల మీద వాహనాలు నడిపే డ్రైవర్లను మార్గనిర్దేశం చేయడానికి, వారిని అప్రమత్తం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వే మీద ప్రతి 10 కిలోమీటర్లకు వాహన లోగోలతో వేగ పరిమితిని సూచించేలా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పాయింట్లు, డైవర్షన్ లాంటి వివరాలు సైతం సైన్ బోర్డులో కనిపించాలని కొత్త రూల్స్ తీసుకువస్తోంది.


ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు


రహదారి యాజమాన్య ఏజెన్సీలు ప్రమాదాలను నివారించడంలో భాగంగా ప్రతి పది కిలోమీటర్లకు వేగ పరిమితిని సూచించేలా సైన్ బోర్డుల ఏర్పాటు తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి, 2025 నుంచి ఎక్స్‌ప్రెస్‌వేలు, నేషనల్ హైవేలపై ఇది అమలులోకి రానుంది. ఇలా చేయడాన్ని రోడ్డు పరిభాషలో డ్రైవర్లకు సూచనలు ఇవ్వడం లాంటిది, వారిని ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరగకుండా అలర్ట్ చేయడం లాంటిది. సైన్ బోర్డులు ద్వారా డ్రైవర్లకు మార్గనిర్దేశం చేయడం ద్వారా వేగం నియంత్రణలో ఉంటే ప్రమాదాలు తగ్గుతాయని రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ భావిస్తోంది. 


స్పీడ్ లిమిట్, ఎగ్జిట్ పాయింట్ల వివరాలు
స్పీడ్ లిమిట్స్‌తో పాటు ఎగ్టిట్ పాయింట్స్ మీద అవగాహన కోసం కొన్ని సైన్ బోర్డులు ఉండటం మంచిదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే నేషనల్ హైవేల మీద ప్రతి 10 కిలోమీటర్లకు ఓ చోట వేగ పరిమితిని సూచించేలా సైన్ బోర్డులు, ఎగ్జిట్ పాయింట్లకు సంబంధించి వివరాలు ఉండేలా చూసుకోవాలని ఇటీవల పేర్కొంది. అదే విధంగా ప్రతి 5 కిలోమీటర్లకు ఓ చోట నో పార్కింగ్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఓ చోట ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ సైతం డిస్ ప్లే చేయాలని గైడ్ లైన్స్ సిద్ధం చేశారు. ఫిబ్రవరి నుంచి సరికొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి.



Also Read: Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా