Shiv Sena Symbol: మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో ఠాక్రే వర్గానికి కాగడా గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింంది. రెండు రోజుల క్రితమే విల్లు, బాణం గుర్తును ఈ ఎన్నికల వరకు ఫ్రీజ్ చేసింది. రెండు వర్గాలకు మూడేసి ప్రత్యామ్నాయ గుర్తులు, చిహ్నాలు ఇవ్వాలని ఆదేశించింది. 


శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శిబిరాలు తమకు నచ్చిన మూడు ప్రత్యామ్నాయ చిహ్నాలు, పేర్లను ఎన్నికల సంఘానికి ఆదివారం సమర్పించాయి. ఈ చిహ్నాలను మరే ఇతర పార్టీ అయినా ఉపయోగిస్తోందా లేదా అని ఎన్నికల సంఘం పరిశీలించింది. ఈ చిహ్నాల వాడకాన్ని నిషేధించారా లేదా అని కూడా కమిషన్ చూసింది. ఓ ఎన్నికల సంఘ మాజీ అధికారి మాట్లాడుతూ "చిహ్నాన్ని కేటాయించడం కమిషన్ ప్రత్యేక హక్కు. ఇలాంటి టైంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వద్ద అందుబాటులో ఉన్న స్వతంత్ర చిహ్నాల జాబితాలో చేర్చని చిహ్నాన్ని కమిషన్ (కమిషన్) కేటాయించవచ్చు. అని అన్నారు. 


శివసేన పేరు, గుర్తులు ఫ్రీజ్ చేసిన ఈసీ 


అంధేరి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న జరిగాల్సిన ఉపఎన్నికలో శివసేనకు చెందిన రెండు శిబిరాలు పార్టీ పేరు, గుర్తులను ఉపయోగించకుండా ఎన్నికల సంఘం శనివారం నిషేధం విధించింది. పార్టీని నియంత్రించాలని శిందే శిబిరం ఫిర్యాదు మేరకు  ఈసీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నాటికి తమకు నచ్చిన మూడు వేర్వేరు పేర్లు, చిహ్నాలను ఇవ్వాలని కమిషన్ వారిని కోరింది.


ఉద్ధవ్ వర్గం ఇచ్చిన చిహ్నాలు


ఉపఎన్నికల్లో తమకు త్రిశూల్, మాషాల్(మ), ఉదయించే సూర్యుడు అనే మూడు చిహ్నాల్లో ఒక చిహ్నం, పేరును కేటాయించాలని ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం కమిషన్‌కు రిక్వస్ట్ చేశారు. శిందే శిబిరానికి మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా ఉపఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 14. అటువంటి పరిస్థితిలో రెండు శిబిరాల ప్రత్యామ్నాయ చిహ్నాలు, పేర్లపై కమిషన్ పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఠాక్రే వర్గానికి కాగడా గుర్తును కేటాయించింది. 


శివ‌సేన పార్టీ పేరును, గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేయడంపై న్యాయపోరాటానికి దిగింది ఠాక్రే వర్గం. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 


ఇలా జరిగింది 


అస‌లైన శివ‌సేన త‌మ‌దే అని నిరూపిస్తూ ఆగ‌స్టు 8లోగా డాక్యుమెంట‌రీలు స‌మ‌ర్పించాల‌ని గ‌తంలోనే ఈసీ రెండు వ‌ర్గాల‌ను ఆదేశించింది. అయితే ఠాక్రే వ‌ర్గం అభ్య‌ర్థ‌న‌తో గ‌డువును అక్టోబ‌ర్ 7 వ‌ర‌కు పొడిగించింది. అయితే, ఉప ఎన్నిక‌ల్లో పోటీ కోసం త‌మ‌కు శివ‌సేన విల్లు బాణం గుర్తు కేటాయించాలని శిందే వ‌ర్గం ఈసీని అభ్య‌ర్థించింది.


దీంతో శిందే వ‌ర్గం అభ్య‌ర్థ‌న‌పై స్పందన తెలియజేయాల‌ని ఎన్నిక‌ల సంఘం ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్గాన్ని కోరింది. ఈ క్ర‌మంలో ఉద్ద‌వ్ వ‌ర్గం శ‌నివార‌మే ఈసీకి త‌మమ స్పంద‌న తెలియ‌జేసింది. శిందే వ‌ర్గం డాక్యుమెంటేషన్ క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు నాలుగు వారాల స‌మ‌యం కావాలని కోరింది. తర్వాత విచారించి విల్లు, బాణం గుర్తును ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంంది. 


పెద్ద యుద్ధమే


శివసేన ఎవరిదన్న అంశంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీంతో ఇరు వర్గాలు ఎప్పుడో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. తమదే నిజమైన శివసేన అని ఏక్‌నాథ్ శిందే వర్గం చెప్పటంతో పాటు, శివసేన
పార్టీ గుర్తుని తమకే ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే విచారణ తేలేంత వరకూ ఎన్నికల సంఘం ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సుప్రీం కోర్టు గతంలో తేల్చి చెప్పింది. అనంతరం ఈ అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.


ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఇంకా శివసేన ఎవరిది అన్న చర్చ వాడివేడిగా సాగుతూనే ఉంది. ఈ అంశంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఎన్నోసార్లు స్పందించారు. బాలాసాహెబ్ స్థాపించిన శివసేనను కేంద్ర ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు. 56 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఇలా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.