Alert Scam News: బెంగళూరులో కొత్త స్కామ్‌- మీ ఏరియాలో కూడా జరగొచ్చు జర జాగ్రత్త!

New Scam Viral : బెంగళూరులో ఓ కొత్త స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. డెలివరీ పేరుతో జరిగే ఈ మోసం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. 

Continues below advertisement

News Scam Alert: రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లనే టార్గెట్ చేసుకొని బెంగళూరులో కొత్త స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. జరిగిన మోసం పై బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.  

Continues below advertisement

బెంగళూరుకు చెందిన ఆ యువకుడి స్నేహితురాలికి ఓ ఫోన్ వచ్చింది. గతంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తే ఫోన్ చేశాడు. నేరుగా ఇంటికి వెళ్లి మీకు పార్సిల్‌ వచ్చిందని డోర్ తీయాలని చెప్పాడు. క్యాష్ ఆన్ డెలవరీ పార్సిల్ వచ్చిందని తెలిపాడు. అయితే ఆమెకు అనుమానం వచ్చి డోర్ తీయలేదు. 

Also Read: 'ఆ వ్యక్తితో మాకు ఎలాంటి సంబంధం లేదు' - వైజయంతీ మూవీస్ కీలక ప్రకటన

ఇదే విషయాన్ని బెంగళూరు యువకుడు సోషల్ మీడియా పోస్టు చేయడంతో చాలామంది నెటిజన్లు స్పందించారు. తమకి కూడా ఇలాంటి ఫోన్లు వస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కస్టమర్లు ఎలాంటి ఆర్డర్ చేయకపోయినా క్యాష్ ఆన్‌ డెలివరీ పార్శిల్స్ వస్తున్నాయని అంటున్నారు. 

ఇందులో స్కామ్ ఏంటంటే... మీరు పేరు మీదే ఆర్డర్ ఉంటుంది. అయితే అందులో చీఫ్‌ ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. మీరు ఖరీదు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాష్ ఆన్‌ డెలివరీ కాబట్టి క్యాష్ ఇచ్చిన తర్వాతే పార్శిల్ ఇస్తారు. కాబట్టి అందులో ఏం ఉందో చూడటానికి వీలుడందు. ఒకసారి మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పార్శిల్ తెరిచి చూసి మోసం పోయాం అని తెలుసుకునేసరికి ఆ వ్యక్తి పత్తా లేకుండా పోతాడు. 

ఇది బెంగళూరులో కామన్‌గా జరుగుతోందని అంటున్నారు నెటిజన్లు. అందుకే ఇలాంటి సీవోడి పేరుతో వచ్చే పార్శిల్ జోలికి వెళ్లొద్దని అంటున్నారు. మీరు ఆర్డర్ చేయకపోయినా మీకు తెలిసిన వాళ్లెవరూ ఆర్డర్ చేశారని చెప్పి ఇలాంటివి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. అనుమానం ఉంటే పార్శిల్ పంపించిన కంపెనీకి కానీ లేదా పార్శిల్ పంపించిన వ్యక్తికి ఫోన్ చేసి అడగడం మంచిదని చెబుతున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా సరే కచ్చితంగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు.  

Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 ల్యాప్‌టాప్‌లు ఇవే

Continues below advertisement