సుప్రీం కోర్టు బుధవారం మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి సొంత రాష్ట్రంలో ఎస్సీ గానీ ఎస్టీ గానీ అయి ఉంటే అక్కడే ఉద్యోగ, విద్య, భూ కేటాయింపుల రిజర్వేషన్‌కు అర్హుడని తేల్చి చెప్పింది. అదే వ్యక్తి వేరే రాష్ట్రానికి వలస వెళ్తే అక్కడ ఉద్యోగ, విద్య, భూ కేటాయింపులో రిజర్వేషన్ పొందేందుకు అర్హుడు కాదని తేల్చి చెప్పేసింది.
జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఒక్క వ్యక్తి ఎస్సీ ఎస్టీ అయితే తన సొంత రాష్ట్రంలోనే రిజర్వేషన్లు వర్తిస్తాయి. వేరే రాష్ట్రానికి వలస వెళ్లినప్పుడు ఏ రిజర్వేషన్లు వర్తించవు. పంజాబ్‌కు చెందిన ఎస్సీ వ్యక్తి రాజస్థాన్‌లో రిజర్వేషన్ కింద భూమి పొందడానికి వీల్లేదని కోర్టు తెలిపింది. ఆయనకు కేటాయించిన స్థలాన్ని అసలు లబ్ధిదారుడికి ఇవ్వాలని సూచించింది. రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. రాజస్థాన్ టెనెన్సీ యాక్ట్ 1955ను ఉల్లంఘిస్తూ జరిగిన కేటాయింపును సరి చేసిన సుప్రీం కోర్టు.. భదర్ రామ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ కొట్టేసింది.
‘‘మహారాష్ట్ర, మరో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కుల ధృవీకరణ పత్రం జారీపై యాక్షన్ కమిటీ (1994)లో సుప్రీం కోర్టు తీర్పు ప్రస్తుత కేసులో పూర్తిగా వర్తిస్తుంది. ప్రతివాది పంజాబ్‌కు చెందిన ఎస్సీ. ఆ రాష్ట్రంలో ఆయన శాశ్వత నివాసి అయినందున, ఎస్సీ వ్యక్తికి చెందిన భూమిని కొనుగోలు చేయడం కోసం రాజస్థాన్‌లోని ఎస్సీ ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరు. రాజస్థాన్‌లో ఎస్సీ భూమిలేని ఎస్సీ వ్యక్తులకు అది గతంలో కేటాయించారు.’’ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఆస్తి విక్రయానికి సంబంధించి అంగీకరించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.
Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని
Also Read: Covid Cases: టాప్ గేరులో కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో ఏకంగా 90 వేల కేసులు.. బీ అలర్ట్!
Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి