Constable Revathi: భారత్‌ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తమిళనాడులోని సాతంకుళం. కస్టడీలో ఉన్న తండ్రీ కొడుకులను అతి దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో జరిగిన ఈ ఉదంతం, దేశంలో పోలీసు వ్యవస్థలోని అరాచకాలను ఎత్తి చూపింది. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో దోషులకు శిక్ష పడేలా చేయడంలో ఒక సామాన్య కానిస్టేబుల్ చూపిన సాహసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Continues below advertisement

ఆ రాత్రి ఏం జరిగింది?

2020 జూన్‌ నెలలో కరోనా లాక్‌-డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో సాతంకుళంలో మొబైల్‌ షాపు నడుపుతున్న పి. జయరాజ్, ఆయన కుమారుడు జె. బెన్నిక్స్ తమ దుకాణాన్ని నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచారనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ రాత్రి పోలీస్ స్టేషన్‌లో జరిగిన హింస వర్ణనాతీతం. పోలీసులు తమ విచక్షణను మరిచి, లాఠీలతో, బూటు కాలితో వారిపై విరుచుకుపడ్డారు. 

మపులు తిప్పిన రేవతి సాక్ష్యం 

ఈ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడటంలో కీలక పాత్ర పోషించింది హెడ్ కానిస్టేబులు రేవతి. అదే స్టేషన్‌లో పని చేస్తున్న ఆమె, తన తోటి అధికారులు చేస్తున్న అరాచకాన్ని కళ్లారా చూసింది. ఉన్నతాధికారుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నా, తన ఉద్యోగానికి, కుటుంబానికి ముప్పు ఉందని తెలిసినా ఆమె వెనక్కి తగ్గలేదు. జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎంఎస్‌ భారతీ దాసన్ విచారణకు వచ్చినప్పుడు " సార్ నేను ప్రతి విషయాన్ని చెబుతారు. దాచిన విషయాలు వెలుగులోకి తీసుకొస్తాను. కానీ నా ఇద్దరు చిన్న పిల్లల భద్రతకు మీరు హామీ ఇవ్వగలరా" అని ఆమె అడిగిన ప్రశ్న ఆమెలోని భయాన్ని, అదే సమయంలో ఆమెకున్న ధైర్యాన్ని చాటిచెప్పింది. 

Continues below advertisement

హింసకు పరాకాష్ట

రేవతి తన సాక్ష్యంలో ఆ రాత్రి జరిగిన దారుణాలను వివరించారు. పోలీసులు బాధితులను బట్టలు విప్పి దారుణంగా కొట్టడమే కాకుండా, వారి ప్రైవేటు భాగాలపై బూట్లతో తొక్కారు. అంత హింస జరుగుతున్నా, పోలీసులు మధ్య మధ్యలో మద్యం సేవించి మరీ మళ్లీ కొట్టేవారని ఆమె వెల్లడించారు. తండ్రీ కొడుకులు స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు రేవతి జయరాజ్‌కు కాఫీ ఇవ్వబోగా, ఇతర సిబ్బంది దానిని విసిరికొట్టారు. ఆ హింసను చూడలేక ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

రేవతికి బెదిరింపులు 

సాక్ష్యం చెప్పకుండా రేవతిని తోటి పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేశారు. మేజిస్ట్రేట్‌ విచారణ జరుగుతున్న సమయంలో కూడా స్టేషన్ బయటకు పోలీసులు గుమిగూడి రేవతిని భయపెట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందంటే, రేవతి తన స్టేట్‌మెంట్‌పై సంతకం చేయడానికి కూడా తొలుత భయపడ్డారు. మద్రాస్‌ హైకోర్టు జోక్యం చేసుకొని ఆమెకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఆమె భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించింది. 

న్యాయం ఎలా గెలిచింది?

ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించి, నిందితులను గుర్తించడంలో రేవతి సాక్ష్యం ఎంతో సహయపడింది. ఐదేళ్లపాటు సాగిన ఈ కేసులో చివరికి న్యాయస్థానం సహాయపడింది. ఐదేళ్లపాటు సాగిన ఈ కేసులో చివరికి న్యాయస్థఆనం పోలీసులకు మరణశిక్ష విధించడం ద్వారా, చట్టం ముందు ఎవరూ అతీతులుకారని నిరూపితమైంది.