Tirumala Tirupati Laddu Controversy: తిరుమల తిరుపతి లడ్డూ వివాదం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. పరమ పవిత్రంగా భావించే ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణ సంచలనంగా మారుతోంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. విరుగుడు చర్యలు కూడా తీసుకుంది. ఈ వ్యవహారంపై స్పందించిన ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం జగ్గీ వాసుదేవ్ అభిప్రాయపడ్డారు. అందుకే దేవాలయాలను భక్తులే నడపాలని ప్రభుత్వాలు, వారు నియమించిన అధికారులు కాదని అన్నారు. అసలు భక్తి లేని చోట పవిత్రత ఉండదని తేల్చేశారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పోస్టు చేసిన జగ్గీ వాసుదేవ్... తిరుమల లడ్డూ వివాదంపై ఇలా స్పందించారు. "ఆలయ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం వాటిని భక్తులు తినడం అసహ్యకరమైన విషయం. అందుకే దేవాలయాలను ప్రభుత్వ అధికారులు కాకుండా భక్తులే నడపాలి. భక్తి లేని చోట పవిత్రత ఉండదు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండకూడదు. భక్తులైన హిందువులతో నిర్వహించాలి. " అని అన్నారు.