Russia Luna-25 crashes into Moon: 
ఆగమేఘాల మీద రష్యా లూనా ప్రయోగించింది. దాంతో రష్యా ప్రయోగించిన లూనా 25 చంద్రుడిపై కూలిపోయింది. దాంతో ప్రపంచం దృష్టి చంద్రయాన్ 3 పై మళ్లింది. ఆచితూచి చంద్రుడి కక్ష్యను చేరుకున్న చంద్రయాన్ 3. సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలమనే ధీమాతో ఇస్రో సైంటిస్టులు ఉన్నారు..


రష్యా చంద్రుడిపైకి పంపించిన లూనా 25 చంద్రుడిపైన కుప్పకూలి పోవటంతో మన ఇస్రో శాస్త్రవేత్తల్లోనూ టెన్షన్ మొదలైంది. వాస్తవానికి చంద్రయాన్ 3 ని కేవలం 600 కోట్ల రూపాయల బడ్జెట్ లో తయారు చేసి పంపించిది ఇస్రో. అది కూడా స్లింగ్ షాట్ పద్ధతిలో భూమి చుట్టూ గురుత్వాకర్షణ నుంచి బయటపడి.. చంద్రుడిని చేరుకుని అక్కడా ఇలానే కక్ష్యను తగ్గించుకుంటూ చంద్రుడి దక్షిణ ధృవంపై దిగేందుకు ప్లాన్ చేసింది. 


రష్యా అలా చేయలేదు. 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆగస్టు 11న రాకెట్ ను ప్రయోగించింది. ఆగస్టు 21న అంటే కేవలం పదంటే పదిరోజుల్లో చంద్రుడి సౌత్ పోల్ మీద ల్యాండర్ ను సేఫ్ గా జాబిల్లిపై దించాలని భావించింది. కానీ బ్యాడ్ లక్. అతి తక్కువ సమయంలో ప్రయోగం సక్సెస్ చేయాలనుకోవడమో, లేక భారత్ కంటే ముందుగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి తొలి దేశంగా అరుదైన ఘనత సాధించాలనుకోవడం రష్యా శాస్త్రవేత్తలు చేసిన తప్పిదంగా కనిపిస్తోంది. లూనా 25 సాంకేతిక సమస్యలతో చంద్రుడిపై ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టి క్రాష్ అయిపోయింది. 


రష్యా ప్రయోగించిన లూనా 25 చంద్రుడిపై కొన్ని అడుగుల దూరంలో ఉండగా కూలిపోవడం మన ఇస్రో శాస్త్రవేత్తల్లోనూ టెన్షన్ పెంచేస్తోంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ చంద్రయాన్ 2 తో ఓ చేదు అనుభవం ఉంది. అప్పుడు కూడా ఇలానే చంద్రయాన్ 2 లోని విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడి దక్షిణ ధృవంపై దింపాలని ప్రయత్నించి...చంద్రుడిపై క్రాష్ అయిపోయింది. దాన్ని దృ్ష్టిలో పెట్టుకునే ఈ సారి తప్పుల ఆధారంగా మరో మోడల్ ను తయారు చేసిన ఇస్రో చంద్రయాన్ 3 గా పంపించింది. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న రష్యాకు కొరకరాని కొయ్యగా మారిన చంద్రుడి సౌత్ పోల్ మనకు మరోసారి ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో అని మన ఇస్రో శాస్త్రవేత్తల్లో టెన్షన్ మొదలై ఉంటుంది. కానీ గతంలో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ఈ సారి చంద్రయాన్ 3 ప్రయోగం చేశాం కాబట్టి 99 శాతం సక్సెస్ అయ్యే అవకాశమే ఉందని ఇస్రో సైంటిస్టులు ధీమాగా ఉన్నారు.



రష్యాకు నిరాశ.. 
రష్యా లూనా 25 మూన్ మిషన్ విఫలమైంది. చంద్రుడిపై దిగే క్రమంలో క్రాష్ అయినట్టు బలంగా ఢీకొట్టడం వల్ల మిషన్ ఫెయిల్ అయింది. ఆగస్టు 11న ఈ Russia Luna-25 Moon Mission లాంఛ్‌ చేసింది రష్యా. ఆగస్టు 21న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవ్వాల్సి ఉన్నా...ఢీకొట్టడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. రష్యా స్పేస్ కార్పొరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...రోబో ల్యాండర్ అన్‌కంట్రోల్డ్ ఆర్బిట్‌లోకి ప్రవేశించి క్రాష్ అయింది. "రోబో ల్యాండర్ అనుకోకుండా ఓ ఆర్బిట్‌లోకి ఎంటర్ అయ్యింది. ఆ తరవాత చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది" అని వెల్లడించింది.