కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది స్పాట్‌లో మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగనుందని పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. అక్కడి ప్రమాద దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. 


కర్ణాటకలో పావగడ వద్ద ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు సమీపంలో పావగడ తాలూకా పలవళ్లి  క్రాస్ వద్ద బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. రోడ్డు మలుపు వద్ద బస్సును టర్న్ చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. 


ఈ యాక్సిడెంట్‌లో ఎనిమిది మంది స్పాట్‌లోనే కన్నుమూశారు. ఇంకా బస్సులో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరిస్తున్నారు. బస్సు పూర్తిగా తీసిన తర్వాత మృతల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 







ప్రస్తుతానికి ఎనిమిది మంది మృతిని అధికారులు కన్ఫామ్ చేశారు. ఈ సంఖ్య మరింత పెరిగొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పావగడకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెహట్టి వద్ద ఈ బస్సు బోల్తాపడింది.   మృతులంతా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్‌గా చెబుతున్నారు.