Padma Awards Winner List: న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం 2026 పద్మ అవార్డులను ప్రకటించింది. సామాజిక సేవ, కళలు, విద్య, వ్యవసాయం, సామాజిక సంక్షేమంలో చేసిన కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కొందరు ప్రముఖులకు పద్మ అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంది. ఈ ఏడాది 5 మందికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్, 13 మంది మూడో అత్యున్నత పౌర పురస్కారం, 113 మందికి నాలుగో పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది.
ఇటీవల కన్నుమూసిన బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు (కళలు) పద్మవిభూషణ్ ప్రకటించారు. ఎన్.రాజన్ (కళలు), కె.టి.థామస్ (సామాజిక సేవ), పి.నారాయణన్ (సాహిత్యం), వి.ఎస్. అచ్యుతానందన్ (మరణానంతరం) (సామాజిక సేవ)లను పద్మ విభూషణ్ అవార్డు వరించింది. డాక్టర్ నోరి దత్తాత్రేయుడుతో పాటు నటుడు మమ్ముట్టి సహా 13 మందిని పద్మ భూషణ్ వరించింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం సాయంత్రం (జనవరి 25, 2026) పద్మ అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేసింది. పద్మభూషణ్, పద్మవిభూషణ్ గ్రహీతల జాబితాను సైతం కేంద్రం విడుదల చేసింది.
ఐదుగురికి పద్మవిభూషణ్
1.ధర్మేంద్ర (మరణానంతరం) - కళలు, మహారాష్ట్ర2. కేటీ థామస్ - ప్రజాసేవ, కేరళ3. ఎన్. రాజమ్ - కళలు, ఉత్తరప్రదేశ్4. పి. నారాయణన్ - సాహిత్యం, కేరళ5. విఎస్ అచ్యుతానందన్ - ప్రజాసేవ, కేరళ
13 మందికి పద్మభూషణ్ పురస్కారం..
సింగర్ అల్కా యాగ్నిక్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం భగత్ సింగ్ కోష్యారీ, నటుడు మమ్ముట్టి సహా 13 మందికి దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. కల్లిపట్టి రామసామి పళనిస్వామి, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, పీయూష్ పాండే (మరణానంతరం), జార్ఖండ్ మాజీ CM శిబు సోరెన్ (మరణానంతరం), VK మల్హోత్రా (మరణానంతరం), VK మల్హోత్రా (మరణానంతరం), ఉదయ్ కోటక్, SK M మైలానందన్, శతావధాని R గణేష్, వెల్లపల్లి నటేశన్, విజయ్ అమృత్‌రాజ్‌కు పద్మభూషణ్ పురస్కారంతో కేంద్రం గౌరవించింది.
పద్మభూషణ్ గ్రహీతలు వీరే..
- నోరీ దత్తాత్రేయుడు (వైద్యం)- అమెరికా
- అల్కా యాజ్ఞిక్ (కళలు)- మహారాష్ట్ర
- భగత్‌సింగ్ కోశ్యారీ (ప్రజావ్యవహారాలు)- ఉత్తరాఖండ్
- కల్లిపట్టి రామసామి పళనిస్వామి (వైద్యం)- తమిళనాడు
- మమ్ముట్టి (కళలు)- కేరళ
- విజయ్ అమృత్‌రాజ్ (క్రీడలు)- అమెరికా
- పీయూష్ పాండే (మరణాంతరం) (కళలు)- మహారాష్ట్ర
- ఎస్‌కేఎం మెయిలానందన్ (సామాజిక సేవ)- తమిళనాడు
- శతావధాని ఆర్ గణేశ్ (కళలు)- కర్ణాటక
- శిబూ సోరెన్ (మరణాంతరం) (ప్రజావ్యవహారాలు)- ఝార్ఖండ్
- ఉదయ్ కొటక్ (వాణిజ్యం-పరిశ్రమలు)- మహారాష్ట్ర
- వీకే మల్హోత్రా (మరణాంతరం) (ప్రజా వ్యవహారాలు)- ఢిల్లీ
- వెల్లప్పల్లి నటేశన్ (ప్రజా వ్యవహారాలు)- కేరళ
పద్మశ్రీ అవార్డు విజేతలు..
తెలంగాణకు చెందిన కుమారస్వామి తంగరాజ్, రామా రెడ్డి మామిడిలను పద్మశ్రీ వరించింది. వీరితో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన చిరంజీ లాల్ యాదవ్, గుజరాత్‌కు చెందిన ధార్మిక్ లాల్ చున్ని లాల్ పాండ్యా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బుధారి తాటి, ఒడిశాకు చెందిన చరణ్ హెంబ్రామ్‌లకు అన్‌సంగ్ హీరోస్ విభాగంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌కు చెందిన భగవాన్ దాస్ రైక్వార్, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన బ్రిజ్ లాల్ భట్, కర్ణాటకకు చెందిన అంకే గౌడ, మహారాష్ట్రకు చెందిన అర్మిదా ఫెర్నాండెజ్ కూడా దేశంలోని నాల్గవ అత్యున్నత గౌరవాన్ని అందుకుంటారు.
పద్మశ్రీ విజేతలు.. వారి రంగం, రాష్ట్రం
ఎ ఇ ముత్తునాయగం – సైన్స్ & ఇంజనీరింగ్ – కేరళ
అనిల్ కుమార్ రాస్తోగి – కళలు – ఉత్తర ప్రదేశ్
అంకె గౌడ ఎం – సామాజిక సేవ – కర్ణాటక
ఆర్మిడా ఫెర్నాండెజ్ – వైద్యం – మహారాష్ట్ర
అరవింద్ వైద్య – కళలు – గుజరాత్
అశోక్ ఖాడే – వాణిజ్యం & పరిశ్రమలు – మహారాష్ట్ర
అశోక్ కుమార్ సింగ్ – సైన్స్ & ఇంజనీరింగ్ – ఉత్తర ప్రదేశ్
అశోక్ కుమార్ హల్దార్ – సాహిత్యం & విద్య – పశ్చిమ బెంగాల్
బల్దేవ్ సింగ్ – క్రీడలు – పంజాబ్
భగవాన్ దాస్ రైక్వార్ – క్రీడలు – మధ్యప్రదేశ్
భరత్ సింగ్ భారతి – కళలు – బీహార్
భిక్ల్యా లడక్యా ధిందా – కళలు – మహారాష్ట్ర
విశ్వ బంధు (మరణానంతరం) – కళలు – బీహార్
బ్రిజ్ లాల్ భట్ – సామాజిక సేవ – జమ్మూ & కాశ్మీర్
బుద్ధ రష్మి మణి – పురావస్తు శాస్త్రం – ఉత్తర ప్రదేశ్
బుధ్రి తాటి – సామాజిక సేవ – ఛత్తీస్‌గఢ్
చంద్రమౌళి గడ్డమనుగు – సైన్స్ & ఇంజనీరింగ్ – తెలంగాణ
చరణ్ హేంబ్రం – సాహిత్యం & విద్య – ఒడిశా
చిరంజీ లాల్ యాదవ్ – కళలు – ఉత్తర ప్రదేశ్
దీపికా రెడ్డి – కళలు – తెలంగాణ
ధార్మిక్ లాల్ చునీలాల్ పాండ్యా – కళలు – గుజరాత్
గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ – కళలు – ఆంధ్రప్రదేశ్
గఫ్రుద్దీన్ మేవతి జోగి – కళలు – రాజస్థాన్
గంభీర్ సింగ్ యోంజోన్ – సాహిత్యం & విద్య – పశ్చిమ బెంగాల్
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) – కళలు – ఆంధ్రప్రదేశ్
గాయత్రి బాలసుబ్రమణియన్ & రంజని బాలసుబ్రమణియన్ (ద్వయం) – కళలు – తమిళనాడు
గోపాల్ జీ త్రివేది – సైన్స్ & ఇంజనీరింగ్ – బీహార్
గూడూరు వెంకటరావు – వైద్యం – తెలంగాణ
హెచ్ వి హండే – వైద్యం – తమిళనాడు
హల్లీ వార్ – సామాజిక సేవ – మేఘాలయ
హరి మాధబ్ ముఖోపాధ్యాయ (మరణానంతరం) – కళలు – పశ్చిమ బెంగాల్
హరిచరణ్ సైకియా – కళలు – అస్సాం
హర్మన్‌ప్రీత్ కౌర్ భుల్లర్ – క్రీడలు – పంజాబ్
ఇందర్జిత్ సింగ్ సిద్ధూ – సామాజిక సేవ – చండీగఢ్
జనార్దన్ బాపురావ్ బోతే – సామాజిక సేవ – మహారాష్ట్ర
జోగేష్ దేవురి – వ్యవసాయం – అస్సాం
జుజర్ వాసి – సైన్స్ & ఇంజనీరింగ్ – మహారాష్ట్ర
జ్యోతిష్ దేబ్ నాథ్ – కళలు – పశ్చిమ బెంగాల్
కె పజనివెల్ – క్రీడలు – పుదుచ్చేరి
కె రామసామి – సైన్స్ & ఇంజనీరింగ్ – తమిళనాడు
కె విజయ్ కుమార్ – సివిల్ సర్వీస్ – తమిళనాడు
కబింద్ర పుర్కాయస్థ (మరణానంతరం) – ప్రజా వ్యవహారాలు – అస్సాం
కైలాష్ చంద్ర పంత్ – సాహిత్యం & విద్య – మధ్యప్రదేశ్
కళామండలం విమల మీనన్ – కళలు – కేరళ
కేవల్ క్రిషన్ థక్రాల్ – వైద్యం – ఉత్తర ప్రదేశ్
ఖేమ్ రాజ్ సుంద్రియాల్ – కళలు – హర్యానా
కొల్లాక్కల్ దేవకి అమ్మ జి – సామాజిక సేవ – కేరళ
కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ – సైన్స్ & ఇంజనీరింగ్ – తెలంగాణ
కుమార్ బోస్ – కళలు – పశ్చిమ బెంగాల్
కుమారస్వామి తంగరాజ్ – సైన్స్ & ఇంజనీరింగ్ – తెలంగాణ
లార్స్-క్రిస్టియన్ కోచ్ – కళలు – జర్మనీ
లియుడ్మిలా విక్టోరోవ్నా ఖోఖ్లోవా – సాహిత్యం & విద్య – రష్యా
మాధవన్ రంగనాథన్ – కళలు – మహారాష్ట్ర
మాగంటి మురళీ మోహన్ – కళలు – ఆంధ్రప్రదేశ్
మహేంద్ర కుమార్ మిశ్రా – సాహిత్యం & విద్య – ఒడిశా
మహేంద్ర నాథ్ రాయ్ – సాహిత్యం & విద్య – పశ్చిమ బెంగాల్
మామిడాల జగదీష్ కుమార్ – సాహిత్యం & విద్య – ఢిల్లీ
మంగళా కపూర్ – సాహిత్యం & విద్య – ఉత్తర ప్రదేశ్
మీర్ హాజీభాయ్ కాసంభాయ్ – కళలు – గుజరాత్
మోహన్ నగర్ – సామాజిక సేవ – మధ్యప్రదేశ్
నారాయణ్ వ్యాస్ – పురావస్తు శాస్త్రం – మధ్యప్రదేశ్
నరేష్ చంద్ర దేవ్ వర్మ – సాహిత్యం & విద్య – త్రిపుర
నిలేష్ వినోద్ చంద్ర మాండ్లేవాలా – సామాజిక సేవ – గుజరాత్
నురుద్దీన్ అహ్మద్ – కళలు – అస్సాం
ఓతువార్ తిరుత్తణి స్వామినాథన్ – కళలు – తమిళనాడు
పద్మ గుర్మెట్ – వైద్యం – లడఖ్
పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి – వైద్యం – తెలంగాణ
పోఖిలా లేక్తేపి – కళలు – అస్సాం
ప్రభాకర్ బసవప్రభు కోరే – సాహిత్యం & విద్య – కర్ణాటక
ప్రతీక్ శర్మ – వైద్యం – అమెరికా (USA)
ప్రవీణ్ కుమార్ – క్రీడలు – ఉత్తర ప్రదేశ్
ప్రేమ్ లాల్ గౌతమ్ – సైన్స్ & ఇంజనీరింగ్ – హిమాచల్ ప్రదేశ్
ప్రోసెన్‌జిత్ ఛటర్జీ – కళలు – పశ్చిమ బెంగాల్
పున్నియమూర్తి నటేసన్ – వైద్యం – తమిళనాడు
ఆర్ కృష్ణన్ (మరణానంతరం) – కళలు – తమిళనాడు
ఆర్ వి ఎస్ మణి – సివిల్ సర్వీస్ – ఢిల్లీ
రబిలాల్ తుడు – సాహిత్యం & విద్య – పశ్చిమ బెంగాల్
రఘుపత్ సింగ్ (మరణానంతరం) – వ్యవసాయం – ఉత్తర ప్రదేశ్
రఘువీర్ తుకారాం ఖేద్కర్ – కళలు – మహారాష్ట్ర
రాజస్తాపతి కాళియప్ప గౌండర్ – కళలు – తమిళనాడు
రాజేంద్ర ప్రసాద్ – వైద్యం – ఉత్తర ప్రదేశ్
రామారెడ్డి మామిడి (మరణానంతరం) – పశుసంవర్ధక శాఖ – తెలంగాణ
రామమూర్తి శ్రీధర్ – రేడియో బ్రాడ్‌కాస్టింగ్ – ఢిల్లీ
రామచంద్ర గోడ్బోలే & సునీత గోడ్బోలే (ద్వయం) – వైద్యం – ఛత్తీస్‌గఢ్
రతిలాల్ బోరిసాగర్ – సాహిత్యం & విద్య – గుజరాత్
రోహిత్ శర్మ – క్రీడలు – మహారాష్ట్ర
ఎస్ జి సుశీలమ్మ – సామాజిక సేవ – కర్ణాటక
సాంగ్యుసాంగ్ ఎస్ పోంగెనర్ – కళలు – నాగాలాండ్
సంత్ నిరంజన్ దాస్ – ఆధ్యాత్మికం – పంజాబ్
శరత్ కుమార్ పాత్ర – కళలు – ఒడిశా
సరోజ్ మండల్ – వైద్యం – పశ్చిమ బెంగాల్
సతీష్ షా (మరణానంతరం) – కళలు – మహారాష్ట్ర
సత్యనారాయణ నువాల్ – వాణిజ్యం & పరిశ్రమలు – మహారాష్ట్ర
సవితా పునియా – క్రీడలు – హర్యానా
షఫీ షౌక్ – సాహిత్యం & విద్య – జమ్మూ & కాశ్మీర్
శశి శేఖర్ వేంపటి – సాహిత్యం & విద్య – కర్ణాటక
శ్రీరంగ్ దేబాబా లాడ్ – వ్యవసాయం – మహారాష్ట్ర
శుభ వెంకటేష్ అయ్యంగార్ – సైన్స్ & ఇంజనీరింగ్ – కర్ణాటక
శ్యామ్ సుందర్ – వైద్యం – ఉత్తర ప్రదేశ్
సీమాంచల్ పాత్రో – కళలు – ఒడిశా
శివశంకరి – సాహిత్యం & విద్య – తమిళనాడు
సురేష్ హనగవాడి – వైద్యం – కర్ణాటక
స్వామి బ్రహ్మదేవ్ జీ మహారాజ్ – సామాజిక సేవ – రాజస్థాన్
టి టి జగన్నాథన్ (మరణానంతరం) – వాణిజ్యం & పరిశ్రమలు – కర్ణాటక
తగా రామ్ భీల్ – కళలు – రాజస్థాన్
తరుణ్ భట్టాచార్య – కళలు – పశ్చిమ బెంగాల్
టెచి గుబిన్ – సామాజిక సేవ – అరుణాచల్ ప్రదేశ్
తిరువారూర్ భక్తవత్సలం – కళలు – తమిళనాడు
తృప్తి ముఖర్జీ – కళలు – పశ్చిమ బెంగాల్
వీళినాథన్ కామకోటి – సైన్స్ & ఇంజనీరింగ్ – తమిళనాడు
వేంపతి కుటుంబ శాస్త్రి – సాహిత్యం & విద్య – ఆంధ్రప్రదేశ్
వ్లాదిమిర్ మెస్ట్విరిష్విలి (మరణానంతరం) – క్రీడలు – జార్జియా
యుమ్నం జాత్రా సింగ్ (మరణానంతరం) – కళలు – మణిపూర్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం
దేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీకి విజేతల్ని ప్రస్తుతం ప్రకటించగా.. భారత ప్రభుత్వం త్వరలో పద్మవిభూషణ్, పద్మభూషణ్ గ్రహీతలను త్వరలో ప్రకటిస్తుంది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీతో పాటు, దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్, మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ గ్రహీతలకు అవార్డులు ప్రదానం చేస్తారు. వివిధ రంగాలలో అంకితభావంతో విశేష కృషి చేసిన వారిని ప్రతి ఏడాది కేంద్రం ప్రభుత్వం పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది.
