ఢిల్లీలో నివసిస్తున్నట్లయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సింది. ఈ వార్తను తప్పక చదవాలి. ప్రభుత్వం నుంచి చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ సర్టిఫికేట్ ఉన్న వాహనాలకే పెట్రోల్ అమ్మాలని.. లేకుంటే తిరస్కరించాలని చమురు బంకు యజమానులను ఆదేశించింది ఢిల్లీ ప్రభుత్వం. బుధవారం అన్ని సంస్థలను సమాచారాన్ని చేరవేసింది.
రిజిస్ట్రేషన్ తేదీ నుంచి సంవత్సరం పైబడిన వాహనాలన్నింటికీ పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలని వాహనాల యజమానులకు సూచించింది. ఈ సర్టిఫికేట్ ఉందో లేదో అన్ని వెహికల్స్‌ను తనిఖీల చేయబోతున్నట్టు ఢిల్లీ రవాణా శాఖ ఒక నోటీసు జారీ
చేసింది.
ప్రజల సమస్యలను దృష్టి పెట్టుకొని తక్షమే కాకుండా అక్టోబర్ 25 వరకు గడువు విధించింది ప్రభుత్వం. ఇలోపు అందరూ పొల్యూషన్ సర్టిఫికేట్స్ చేయించుకోవాలని వాహన యజమానులను రవాణా శాఖ కోరింది. ప్రభుత్వం జారీ చేసిన పీయూసీసీ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.10,000 జరిమానాకానీ, మూడేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఢిల్లీలో కాలుష్య సమస్య దృష్ట్యా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
పెట్రోల్, డీజిల్, సిఎన్జీ బంకుల డీలర్లు అక్టోబర్ 25 నుంచి చెల్లుబాటు అయ్యే పియుసిసి చూపించిన తరువాత మాత్రమే వాహనాలకు ఆయిల్ పోయనున్నారు. ఇది తప్పని సరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని పర్యావరణ శాఖ
పరిశీలిస్తోంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం సమస్య కనిపిస్తుంది. చుట్టుప్రక్కల రాష్ట్రాల్లో వ్యర్థాలు కాల్చడం వల్ల, ఢిల్లీ మొత్తం కాలుష్యం కమ్మేస్తోంది. ప్రజలు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
ఏళ్ల తరబడి నాటి వాహనాలు రోడ్లపై తిరుగుతుండటం కూడా వాయుకాలుష్యానికి ప్రధాన కారణం. ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కాలుష్యం కట్టడి కావడం లేదు. అందుకే ఓల్డ్ వెహికల్స్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ కాలుష్య సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. తిరిగే వాహనంతో కాలుష్యానికి ఎటువంటి హాని లేదంటేనే అలాంటి వెహికల్స్‌ను రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఇస్తారు.
ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ ఢిల్లీలో 954 కాలుష్య తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిని పెట్రోల్ పంపుల సమీపంలో మెకానిక్ షాపుల దగ్గర ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో పియుసిసి తీసుకోవచ్చు. వాహనం కాలుష్యాన్ని తనిఖీ చేస్తారు. దాని ఆధారంగా సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో కూడా పొంద వచ్చు. దీని కోసం వెహికల్ ట్రాన్స్ పోర్ట్ వెబ్ సైట్ కు వెళ్లి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది.