Byjus Layoffs: బైజూస్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ బైజూ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 మార్చి నాటికి బైజూస్ 5 శాతం అంటే 2,500 మంది ఉద్యోగులను తొలగించబోతోంది. 10,000 మంది ఉపాధ్యాయులను నియమించాలని కూడా నిర్ణయించింది. 


బైజూస్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివ్య గోకుల్ నాథ్ మాట్లాడుతూ... కొత్త భాగస్వామ్యాల ద్వారా విదేశాల్లో బ్రాండ్ అవగాహన పెంపొందించడంపై కంపెనీ దృష్టి పెట్టినట్టు ఆయన వివరించారు. ఇది కాకుండా భారతీయ, విదేశీ బిజినెస్‌ కోసం 10,000 మంది ఉపాధ్యాయులను నియమించుకోనుంది. "మేము భారతదేశం అంతటా తమ బ్రాండ్‌ను విస్తరించగలిగాం. ప్రజల్లోకి చొచ్చుకెళ్లాం. మేము ఇప్పుడు మార్చి 2023 నాటికి లాభాల్లోకి రావాలని భావిస్తున్నాం. దీని కోసం, మేము ఒక  మార్గాన్ని సృష్టించాం. ఇందులో మార్కెటింగ్ బడ్జెట్ పెంచుతున్నాం. ఖర్చులను తగ్గించేందుకు ట్రై చేస్తున్నాం. 


దివ్య గోకుల్ నాథ్ మాట్లాడుతూ... పనికిరాని విషయాలు నివారించడానికి మాకు ఈ కొత్త వ్యూహం సహాయపడుతుందని చెప్పారు. 'ట్యూషన్ సెంటర్లు' 'ఆన్ లైన్ లెర్నింగ్ మోడల్' కోసం 10,000 మంది ఉపాధ్యాయులను నియమించాలని భావిస్తున్నట్టు తెలిపారు. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బైజూస్ రూ.4,588 కోట్ల నష్టాన్ని చవిచూసింది.


బైజూస్ సంస్థ భారతదేశంలో 200కిపైగా కేంద్రాలను కలిగి ఉంది. 2022 చివరి నాటికి దీనిని 500 కేంద్రాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం 2021 ఆర్థిక సంవత్సరంలో బైజూ నష్టం రూ .4,588 కోట్లతో రికార్డు స్థాయిలో ఉందని, ఇది ఒక సంవత్సరం క్రితం కంటే 19 రెట్లు ఎక్కువ. అదే సమయంలో అప్పటి నుంచి ఆదాయం భారీగా తగ్గింది.


బైజూస్ అనేది ఒక ఆన్ లైన్ టీచింగ్ యాప్. దీని ద్వారా పిల్లలు ఇంటి వద్దే ఉంటూ చదువుకోవచ్చు. బైజూస్ అనేది అధికారికంగా థింక్ అండ్ లెర్న్ అని పిలిచే ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ ను మాజీ ట్యూటర్ బైజు రవీంద్రన్ స్థాపించారు. అతను కంపెనీలో మూడింట ఒక వంతును కలిగి ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులుగా ఉన్నారు. భారతదేశంలో ఆన్ లైన్ బోధనలో బైజూస్ ముందంజలో ఉంది. భారతదేశంతోపాటు యుఎస్, ఆస్ట్రేలియా, మెక్సికోలోని పిల్లలకు కోడింగ్ బోధించడం ప్రారంభించింది. వాస్తవానికి బైజూస్ యుబిఎస్ గ్రూప్ తో చర్చల్లో ఉంది. అందువల్ల  బైజూస్‌ లాభాల్లోకి వెళ్తందని భావిస్తోందా సంస్థ.