operation sindoor Discussion on Parliament Monsoon Session | న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేసింది. పహల్గాం దాడి అనంతరం జరిగిన పరిణామాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల సమయంలో చర్చ ప్రారంభించారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత ఆత్మరక్షణ కోసమే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) తెలిపారు. లోక్‌సభలో రాజ్‌నాథ్ ప్రసంగిస్తూ.. భారత సైనికులకు హ్యాట్యాఫ్. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత సైనిక చర్య భారతదేశ సైనిక సామర్థ్యానికి, నిర్ణయాత్మక నాయకత్వానికి ప్రతీక అని అన్నారు.
లోక్‌సభలో రక్షణ సింగ్ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ దేశ సరిహద్దులను కాపాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న వీర సైనికులకు నమస్కరిస్తున్నాను. అదే సమయంలో భారతదేశ ఐక్యత, సమగ్రతను చాటి చెప్పేందుకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన అమరవీరులకు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. దేశ ప్రజల తరపున సైనికులందరికీ కృతజ్ఞతలు. ఎవరైనా సైన్యం గురించి మాట్లాడితే ఆచితూచి, ఆలోచించి మాట్లాడాలని " అన్నారు.
అందుకే ఆపరేషన్ సిందూర్..
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. "భారత పౌరులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. అందుకే మే 6, 7 తేదీలలో భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో చారిత్రాత్మక సైనిక చర్యను చేపట్టింది. ఇది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు. ఇది భారతదేశ సార్వభౌమత్వం, గుర్తింపు, దేశ పౌరుల పట్ల కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో ఉగ్రవాదంపై భారత విధానానికి ఒక ప్రభావవంతమైన ప్రదర్శన" అని పేర్కొన్నారు.
సైన్యం లోతుగా అధ్యయనం చేసింది..
రాజ్‌నాథ్ మాట్లాడుతూ, ‘ఆపరేషన్ సిందూర్ నిర్వహించడానికి ముందు, భారత సైన్యం ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసింది. మాకు చాలా చాయిస్‌లు అందుబాటులో ఉన్నాయి, కాని ఉగ్రవాదులు, వారి స్థావరాలకు ఎక్కువ నష్టం కలిగించాలని నిర్ణయం తీసుకున్నాం. వఅదే సమయంలో పాకిస్తాన్ పౌరులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేలా ఉగ్రవాద శిబిరాలను ఎంపిక చేసి నాశనం చేశాం" అని అన్నారు.
"భారత సైన్యం చేసిన ఈ ఖచ్చితమైన చర్యలో 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ సైనిక చర్యలో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారికి శిక్షణ ఇచ్చే వారు, ఉగ్ర స్థావరాల నిర్వాహకులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ప్రమాదకర ఉగ్రవాద సంస్థలకు చెందినవారు ఉన్నారు. మరోవైపు వీరికి పాకిస్తాన్ సైన్యంతో పాటు ISIతో ప్రత్యక్ష సంబంధాలు, మద్దతు ఉన్నాయని" రాజ్‌నాథ్ అన్నారు.
సుదర్శన చక్రం ఎంచుకోవాలని కృష్ణుడే చెప్పారు..
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, "ధర్మాన్ని కాపాడుకోవడానికి సుదర్శన చక్రాన్ని ఎంచుకోవాలని శ్రీకృష్ణుడి నుంచి మనం నేర్చుకున్నాము. 2006 పార్లమెంటు దాడి, 2008 ముంబై దాడులను భారత్ చూసింది. ఇప్పుడు ఇక చాలు అని చెప్పి సుదర్శన చక్రాన్ని సెలక్ట్ చేసుకున్నాం. మనతో సమానంగా ఉన్నవారిపై యుద్ధం చేయాలి. అయితే ప్రేమ, శత్రుత్వం ఒకే స్థాయిలో ఉండాలని గోస్వామి తులసీదాస్ చెప్పారు. అదే సింహం కప్పను చంపితే, అది మంచి సందేశాన్ని ఇవ్వదు. మన ఆర్మీ, సాయుధ దళాలు సింహాల్లాంటివారు..."
నేడు జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భారత ఆర్మీ ఆపరేషన్ మహదేవ్ చేపట్టింది. ఆర్మీ ఎన్ కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ఓ ప్రకటనలో తెలిపారు.