Indian Railways : భారతదేశంలో సామాన్యుడి వాహనంగా ప్రయాణాలలో రైళ్లను ప్రిఫర్ చేస్తుంటారు. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తారు. ఈ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ వేలాది రైళ్లను, కుంభమేళా, తీర్థయాత్రలు లాంటి సందర్భాలలో, సమ్మర్ స్పెషల్ రైళ్లను సందర్భాన్ని బట్టి  నడుపుతోంది. రైలులో ప్రయాణించేవారు ముందుగానే రిజర్వేషన్లు చేసుకుని ప్రయాణించాలని భావిస్తారు. రిజర్వేషన్ కోచ్‌లలో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుంది. అసలే రైల్వేశాఖ టికెట్ బుకింగ్ కోసం జులై 1 నుంచి కొత్త రూల్స్ ప్రకటించింది.  

రైలు ప్రయాణాల కోసం కొన్నిసార్లు రిజర్వేషన్ చేసుకున్న తర్వాత టికెట్ కన్ఫామ్ కాదు. చాలా మంది ప్రయాణికుల టిక్కెట్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటాయి. దాంతో ప్రయాణికులు తమ టికెట్ కన్ఫామ్ కోసం ఎదురు చూస్తుంటారు. టికెట్ కన్ఫర్మేషన్ రైలు ఫైనల్ సీట్ చార్ట్ తయారు చేసిన తర్వాత, అంటే రైలు బయలుదేరే 4 గంటల ముందు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు రైల్వే వెయిటింగ్ టికెట్ రూల్స్‌లో మార్పులు చేయబోతోంది. దాంతో నాలుగు గంటల ముందు కాదు, చాలా ముందుగానే మీకు వెయిటింగ్ టికెట్ స్టేటన్ తెలిసిపోతుంది..

24 గంటల ముందు వెయిటింగ్ టికెట్ స్థితి తెలుస్తుంది

ప్రస్తుతం రైలులో ప్రయాణించే ప్రయాణికులు రైలు బయలుదేరే 4 గంటల ముందు తమ టికెట్ స్టేటస్ తెలుసుకుంటారు. దీనివల్ల చాలా మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాన్ని ఎంచుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో ముందే తెలిస్తే, ప్రయాణికులు బస్సు లేదా ఇతర వాహనాలలో జర్నీ చేయడానికి వీలుంటుంది.  

Also Read: తత్కాల్ టికెట్ బుక్ చేస్తుంటారా! జూలై 1 నుంచి అమలులోకి IRCTC కొత్త రూల్స్

వెయిటింగ్ టికెట్ రూల్స్ కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యను తీర్చనున్నారు. రైల్వే శాఖ త్వరలో వెయిటింగ్ టికెట్ స్టేటస్ ముందుగానే ప్యాసింజర్‌కు తెలిసేలా రూల్స్ మార్చుతున్నారు. భారత రైల్వే నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఇకపై 4 గంటల ముందు కాదు, ప్రయాణికులకు 24 గంటల ముందే టికెట్ వెయిటింగ్ లిస్ట్ స్టేటస్ గురించి సమాచారం అందుతుంది. దీనివల్ల ప్రయాణికులు టికెట్ కన్ఫామ్ అవ్వకపోతే ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాన్ని ఎంచుకోవడానికి సమయం దొరుకుతుంది. దాంతో వారికి ఏ ఇబ్బంది ఉండదు. 

ట్రయల్ పూర్తి.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఈ కొత్త రూల్ అమలు చేయడానికి ఇటీవల బికనీర్ రైల్వే డివిజన్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. రైల్వే శాఖ చేసిన ట్రయల్ సక్సెస్ అయింది. త్వరలో ఈ రూల్ దేశంలోని అన్ని రైల్వే జోన్లలో అమలు చేయనున్నారు. అయితే, ఈ కొత్త రూల్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై రైల్వే శాఖ అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే, ఢిల్లీ, ముంబైతో సహా దేశంలోని అనేక ప్రధాన రైలు మార్గాల్లో త్వరలో వెయిటింగ్ టికెట్ కొత్త రూల్ అమలు చేయబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 

Also Read: Tatkal Ticket Booking: ఐఆర్‌సీటీసీ ఖాతా రద్దు కావచ్చు! తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం రైల్వే కొత్త రూల్, ఆధార్‌ వెరిఫికేషన్ అవసరం