Kedarnath Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కూలిన ఘటనలో పైలట్ సహా ఏడుగురు మృతిచెందడంతో విషాదం చోటుచేసుకుంది. గుప్త్ కాశి నుంచి కేదార్ నాథ్ ధామ్ కు బయలుదేరిన ఆర్యన్ ఏవియేషన్ హెలికాప్టర్ గౌరీకుండ్- సోన్ ప్రయాగ్ అడవులలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఏడుగురు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్ క్యాష్ అయిన సమాచారం అందగానే రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి బయలుదేరింది.

ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ హెలికాప్టర్ లో పైలట్ సహా 7 మంది ఉండగా.. ప్రమాదంలో అందరూ మరణించారు. ఎత్తైన ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది, దాంతో రెస్క్యూ టీం ప్రమాద స్థలానికి చేరుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఈ హెలికాప్టర్ లో దాని సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

గౌరీకుండ్ లో అదృశ్యమైన హెలికాప్టర్ కూలిపోయిందని ఉత్తరాఖండ్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ డాక్టర్ మురుగేషన్ తెలిపారు. క్రాష్ అయిన హెలికాప్టర్ లో ఓ పైలట్ సహా 7 మంది ఉన్నారు. మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఆదివారం (జూన్ 15న) ఉదయం 5:17 గంటలకు, ఆర్యన్ కంపెనీ హెలికాప్టర్ కేదార్ నాథ్ నుండి గుప్త్ కాశి హెలిప్యాడ్ కు 6 మంది భక్తులతో బయలుదేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా, అనుకోని పరిస్థిత్తుల్లో హార్డ్ ల్యాండింగ్ జరగడంతో హెలికాప్టర్ క్రాష్ అయింది.

హెలికాప్టర్‌లో ఉన్నది వీరే

1. రాజ్‌వీర్-పైలట్

2. విక్రమ్ రావత్ BKTC నివాసి రాసి ఉఖిమత్

3. వినోద్

4. త్రిష్టి సింగ్

5. రాజ్‌కుమార్

6. శ్రద్ధా

7. రాశి

ఉత్తరాఖండ్ సీఎం ధామి విచారం 

హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భక్తులు మరణించడం బాధాకరం. ప్రస్తుతం SDRF, స్థానిక అధికారులు, ఇతర రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. 

జూన్ 12 గుజరాల్ లోని అహ్మదాబాద్‌లో లండన్‌కు టేకాఫ్ అయిన కొంత సమయానికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది చనిపోగా, 11ఏ అనే సీటులోని రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్యాసింజర్ ప్రాణాలతో బటయపడ్డాడు. విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీద కూలడంతో అందులోని 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.