Telugu News: ఎమర్జెన్సీ టైంలో టికెట్ లేకుండా నచ్చిన రిజర్వేషన్ బోగీలో ప్రయాణించే ఛాన్స్ ఉందంటే నమ్ముతారా. నిజమండీ బాబు... అలా బ్యాగ్ సర్దుకొని టికెట్ తీసుకోకుండానే ట్రైన్ ఎక్కేయొచ్చు. తాపీగా కూర్చున్న తర్వాత టీటీఈఆర్ వస్తే టికెట్ డబ్బులు ఇచ్చి దర్జాగా మీ సీటను రిజర్వ్ చేసుకోవచ్చు. ట్రైన్ జర్నీ అంటే చాలా వరకు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. కొన్నిసార్లు మాత్రం అప్పటికప్పుడు హడావుడిగా బయల్దేరాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఈ ట్రిక్ మీకు భలే ఉపయోగపడుతుంది.
అర్జంటుగా ఎక్కడికైనా వెళ్లాల్సొచ్చినప్పుడు అప్పటికప్పుడు రైలు టిక్కెట్ దొరకదు కాబట్టీ.. ప్రత్యామ్నాయం కోసం వెతుకుతుంటాం. కానీ ఇక ఆ అవసరం లేదు. ఎప్పుడైనా మనం ఎమర్జెన్సీలో ట్రావెల్ చేయాల్సొస్తే.. మనం అనుకున్న సమయానిక అనుకున్న ట్రైన్ టికెట్‌ని కన్ఫర్మ్ చేసుకొనే అద్భుతమైన దారిది. అమ్మో ఫైన్ కట్టాలేమో అనుకుంటున్నారా? ఆ అవసరమూ లేదండీ...
అర్జంట్ జర్నీ చేయాల్సొస్తే.. మీ మొబైల్‌లో ఐఆర్‌సీటీసీ యాప్‌ను ఓపెన్ చేయండి. దాంట్లో ట్రైన్ అనే సెక్షన్‌లోకి వెళ్లండి. ‘చార్ట్ వేకెన్సీ’ అనే అప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. రైలు పేరో, నంబరో ఎంటర్ చేయాలి. కింద ఆరోజు డేట్ ఎంటర్ చేయాలి. దాని కింద బోర్డింగ్ స్టేషన్ వివరాలివ్వాలి. ‘గెట్ ట్రయిన్ చార్ట్’ మీద క్లిక్ చేస్తే.. స్లీపరా, థర్డ్ ఏసీనా, సెకండ్ ఏసీ నా అని ఆప్షన్స్ వస్తాయి. మీకు కావాల్సిన క్లాస్ సెలక్ట్ చేసుకోగానే... అందులో ఏవైనా సీట్లు ఖాళీ ఉంటే చూపిస్తుంది. ఆ ఖాళీ సీట్ల నంబర్లు నోట్ చేసుకొని వాటిలో ఒక సీటులో వెళ్లి కూర్చోవాలి.
టీసీ చెకింగ్ కి వచ్చినప్పుడు.. ఆయనకు టికెట్‌కి సంబంధించిన చార్జీ డబ్బులిచ్చి టికెట్‌ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇదేం నేరం కాదు. దీనికి ఎలాంటి ఫైన్ పడదు. ఈ చార్ట్‌లో ఎవరెక్కడ దిగుతారన్న విషయాన్నీ పొందుపరుస్తారు కాబట్టీ ఆ వివరాలూ చూసేయొచ్చు. ఇంకెందుకాలస్యం ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసేయండి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ట్రైన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్- సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ వచ్చేశాయి.