IRCTC రద్దు ఛార్జీలు: దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది రైలులో ప్రయాణిస్తుంటారు. వీరిలో చాలా మంది చివరి నిమిషంలో హడావుడి వద్దని ముందుగానే టిక్కెట్‌లు బుక్ చేసుకుని ప్రయాణించడానికి ఇష్టపడతారు. చాలాసార్లు ఆన్‌లైన్‌లో కొన్ని రోజులకు ముందే టిక్కెట్‌లు బుక్ చేసుకుంటారు. ఆలస్యంగా బుక్ చేసుకుంటే టికెట్ కన్ఫామ్ కాదు. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ టికెట్ నగదు వాపసు పొందుతారు. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మరో విషయం హాట్ టాపిక్ అవుతోంది.
ఒక మహిళా యూజర్ తన టికెట్ ఆటోమేటిక్‌గా రద్దు అయిందని సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో ఆమె తన రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకోలేదు. అయినప్పటికీ ఆమె నుండి క్యాన్సిల్ ఛార్జీలు వసూలు చేశారు. ఈ సంఘటన తర్వాత IRCTC మీ టికెట్‌ను రద్దు చేస్తే, అంటే మీ టికెట్ ఆటోమేటిక్‌గా రద్దు అయితే కనుక ప్రయాణికుడు క్యాన్సిలేషన్ ఛార్జీలు చెల్లించాలా అనే ప్రశ్న తలెత్తింది. రైల్వే నియమాలను తెలుసుకుంటే బెటర్.
IRCTC టికెట్‌ను రద్దు చేస్తే రద్దు ఛార్జీలు వర్తిస్తాయా?
మీరు IRCTC ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే, ఒకవేళ టికెట్ కన్ఫాం కాలేదు, అంటే వెయిటింగ్ లిస్ట్‌లో ఉండిపోయింది. అలాంటి టిక్కెట్‌లు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి. ఇందులో ఎలాంటి రద్దు ఛార్జీలు వసూలుచేయరు. ఈ పరిస్థితిలో ఆ ప్రయాణికుల ఖాతాకు పూర్తి నగదు తిరిగి వస్తుంది.
మీరు ఈ-టికెట్ బుక్ చేసుకుంటే, చార్ట్ తయారు చేసిన తర్వాత కూడా అది వెయిటింగ్‌లో ఉండిపోతే కనుక సిస్టమ్ దానిని ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ చేస్తుంది. ఇలాంటి టిక్కెట్‌లపై ప్రయాణికులు ఏమీ చేయనవసరం లేదు. అందులో ఎలాంటి కోత ఉండదు. తత్కాల్ టిక్కెట్‌లకు వేరే రూల్స్ ఉన్నాయి. సీటు దొరకకపోయినా కొన్ని క్లర్కేజ్ ఛార్జీలు తగ్గించే అవకాశం ఉంది.
టికెట్ క్యాన్సిల్ ఛార్జీలు ఎప్పుడు చెల్లించాలి?
మీరు మీ టికెట్‌ను రద్దు చేసుకుంటే అప్పుడు రైల్వే నిబంధనల ప్రకారం ఛార్జీలు చెల్లించాలి. కన్ఫామ్ చేసిన టికెట్‌ను రద్దు చేస్తే, ఛార్జీలు రైలు సమయం ప్రకారం నిర్ణయిస్తారు. స్లీపర్ క్లాస్‌కు సాధారణంగా రూ.120, సెకండ్ ACకి 200 రూపాయలు, ఫస్ట్ ACకి రూ.240 వరకు ఛార్జీలు చెల్లించాలి.
మీ రైలు ప్రయాణానికి 48 గంటల ముందు టికెట్‌ను రద్దు చేస్తే, పూర్తి ఛార్జీలు వస్తాయి. అప్పటి నుంచి టైమ్ దగ్గర పడేకొద్దీ క్రమంగా మీకు తిరిగొచ్చే నగదు తగ్గుతుంది. అదే సమయంలో, మీరు చార్ట్ తయారు చేయడానికి ముందు వెయిటింగ్ టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే, తక్కువ డబ్బులు కట్ అవుతాయి. కానీ చార్ట్ తయారు చేసిన తర్వాత మీ టికెట్ మీద డబ్బు తిరిగి పొందలేరు.
Also Read: