దాదాపు ఐదేళ్ల తర్వాత భారత రైల్వే శాఖ ప్రయాణీకుల ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలు అర్థరాత్రి(1 జులై 2025) నుంచి అమలులోకి వచ్చాయి. రైల్వేశాఖ ఛార్జీలు పెంచడంతోపాటు మరికొన్ని మార్పులు కూడా చేసింది. తత్కాల్ టికెట్ బుకింగ్‌నకు ఆధార్‌ను అనుసంధానం చేసింది. అంతే కాకుండా ఛార్ట్ ప్రిపరేషన్ కూడా ట్రైన్ బయల్దేరడానికి 8 గంటల ముందు చేస్తుంది.
రైల్వే శాఖ జూన్ 30న విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం 2020 తర్వాత తొలిసారిగా ప్రయాణికుల ఛార్జీలు పెంచుతున్నట్టు పేర్కొంది. రైల్వే కార్యకలాపాల ఆర్థిక స్టెబిలిటీ కోసం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త ప్రయాణీకుల రైలు ఛార్జీల రేట్లుఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ (IRCA) అప్‌డేట్ చేసినట్టు ఛార్జీల సవరణతో వివిధ ప్రయాణ తరగతుల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.
నాన్-AC తరగతులు (ఎక్కువ దూరం ప్రయాణించే వారికి): ఛార్జీలు కిలోమీటరుకు 1 పైసా పెరుగుతాయి.
సెకండ్ క్లాస్ (నాన్-ఏసీ): 500 కి.మీ. దాటిన ప్రయాణాలకు కిలోమీటర్‌కు 0.5 పైసలు భారం పడనుంది. 500 కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ల ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు.
దూరం ఆధారిత పెరుగుదల:
501 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు ప్రయాణీంచే ప్యాసింజర్లు ఇప్పుడు ఉన్న టికెట్‌పై రూ. 5 రూపాయలు ఎక్కువ చెల్లించాలి.
1501 నుంచి 2500 కిలోమీటర్ల వరకు రూ. 10 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
2501నుంచి 3000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వాళ్లు 15 రూపాయలు ఎక్కువ చెల్లించాలి.
స్లీపర్ అండ్ ఫస్ట్ క్లాస్ (నాన్-ఏసీ)ఛార్జీలు: ఈ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికులు కిలోమీటర్‌కు 0.5 పైసలు అదనంగా చెల్లించాలి.
ఎయిర్ కండిషన్డ్ తరగతులు: ఏసీ చైర్ కార్, ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో సహా, ఛార్జీలు కి.మీ.కు 2 పైసలు పెరుగుతాయి.
రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లకు కూడా ఈ మార్పులు వర్తిస్తాయి.
AC, నాన్-AC కేటగిరీలకు వేర్వేరు ఛార్జీలు నాన్-AC కేటగిరీలలో స్లీపర్, ఫస్ట్-క్లాస్ ఛార్జీలు కూడా కిలోమీటర్‌కు 0.5 పైసలు పెరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
AC చైర్ కార్, AC-టైర్ 2 AC-టైర్ 3, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో సహా మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని AC తరగతులకు, ఛార్జీలు కి.మీ.కు 2 పైసలు పెరుగుతాయి.
ఈ మార్పులు రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, ఇతర ప్రీమియర్ రైళ్లకు కూడా వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
సబర్బన్, సీజన్ టిక్కెట్లలో ఎటువంటి మార్పులు లేవని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
సబర్బన్ సింగిల్ జర్నీ టిక్కెట్లు, నెలవారీ సీజన్ టిక్కెట్లు (MSTలు), రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్ ఫీజులు వంటి అనుబంధ ఛార్జీలు మారవని మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం GST వర్తిస్తుందని మాత్రం వెల్లడించింది. జులై 1కి ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లపై ఎలాంటి వసూలు ఉండదని కూడా తెలిపింది. అయితే మార్పులు కారణంగా రాత్రి 9 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ సరిగా పని చేయలేదు. డబ్బులు కట్ అయినా సరే టికెట్‌లు కన్ఫామ్ కాలేదు. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.
తత్కాల్ బుకింగ్‌లకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరిఇవాళ్టి నుంచి (జులై 1 ) ఆధార్-ధృవీకరించిన వినియోగదారులు మాత్రమే IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. జులై 15 నుంచి అడ్డగోలుగా ఏజెంట్లు చేసే రిజర్వేషన్ దందాకు అడ్డుకట్టే వేసేందుకు OTP-ఆధారిత ఆధార్ ప్రామాణీకరణను సిస్టమ్ ప్రవేశ పెట్టనుంది.
ట్రైన్ బయలుదేరే 8 గంటల ముందు ఛార్ట్ ప్రిపేర్ ఇప్పుడు ట్రైన్ బయల్దేరి సమయానికి నాలుగు గంటల ముందు మాత్రమే ఛార్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వాళ్లు ఈ సమయంతో ఇబ్బంది పడుతున్నారు. నాలుగు గంటల్లో వేరే ట్రైన్‌కు వెళ్లలేక, ప్రత్యామ్నాయాలు చూసుకోలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ నాలుగు గంటల సమయాన్ని 8 గంటలకు పెంచారు. 8 గంటల ముందు ఛార్ట్ ప్రిపేర్ చేస్తారు. పారదర్శకత, ప్రయాణికుల ప్రణాళిక మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్‌లో కొత్త ప్రయాణీకుల రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ప్రారంభం డిసెంబర్ 2025 నాటికి మరో కీలకమైన అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చేయనున్నారు. PRS నిమిషానికి 1.5 లక్షల బుకింగ్‌ల గరిష్ట నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒకేసారి ఇంత మందిటికెట్ చేసుకునే వీలు ఉంటుంది. హ్యాంగ్ అవ్వడం, ఇతర టెక్నికల్ సమస్యలు లేకుండా ఉంటుంది.