Rahul Gandhi Defamation Case: 


 
పది రోజుల్లోగా వివరణ కోరిన సుప్రీంకోర్టు..


రాహుల్ గాంధీ పరువు నష్టం దావా కేసులో మరో కీలక పరిణామం జరిగింది. రాహుల్‌ని దోషిగా తేల్చడంపై 10రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గుజరాత్‌ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. రాహుల్‌పై పిటిషన్ వేసిన పూర్ణేష్ మోదీకి కూడా ఈ నోటీసులు పంపింది. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది సుప్రీం ధర్మాసనం. ఈ పిటిషన్‌ని ఒకే వైపు నుంచి కాకుండా రాహుల్ వైపు నుంచి కూడా పరిశీలించాలని జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఈ కేసు వల్ల 100 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. శిక్ష పడిన కారణంగా చివరి పార్లమెంట్ సమావేశాలకు ఆయన హాజరు కాలేకపోయారని...ఇప్పుడు కొనసాగుతున్న సమావేశాలకూ వెళ్లేందుకు అర్హత లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను ఆగస్టుకి వాయిదా వేసింది ధర్మాసనం. రాహుల్ గాంధీ తరపున అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు.