Priyanka Gandhi Vadra to contest from Wayanad loksabha constituency | న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా పోటీ రెండు చోట్లా విజయం సాధించారు. అయితే వయనాడ్ ఎంపీ సీటును రాహుల్ గాంధీ వదులుకున్నారు. అంతా ఊహించినట్లే వయనాడు లోక్ సభ ఉప ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ నిలిచారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని వెల్లడించింది.
యూపీలోని రాయ్‌బరేలీ గాంధీ కుటుంబానికి కంచుకోట కోవడంతో రాహుల్ గాంధీ అక్కడినుంచి ఎంపీగా కొనసాగనన్నారు. కేరళ లోని వయనాడ్ సీటును వదులుకుంటారని సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం చర్చ జరిగింది. ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వచ్చినా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. 2019 నుంచి ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ అని ప్రచారం జరుగుతూనే ఉంది. జూన్ లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని అంతా భావించార. ఆఖరికి సస్పెన్స్ కు తెరదించుతూ రాహుల్ గాంధీ పేరునే అధిష్టానం ప్రకటించింది.

స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక..
2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తీరా ఎన్నికల సమయానికి యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రియాంక ప్రచారం చేసిన చోట్లా సైతం ఆ పార్టీకి పెద్దగా కలిసిరాలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక గాంధీ బరిలోకి దిగి ప్రత్యక్ష రాజకీయాల్లో తనను పరీక్షించుకుంటారని పార్టీ నేతలు అనకున్నా చివరికి ఏమీ లేదని తేల్చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి ఓటమి చెందినా, వయనాడ్ గెలుపు రాహుల్ కి చాలా ఊరటనిచ్చింది. ఇటీవల రెండోసారి వయనాడు ప్రజలు రాహుల్ కు పట్టం కట్టినా, ప్రియాంక గాంధీ కోసం ఆ సీటు త్యాగం చేస్తున్నారు. కాంగ్రెస్ కు, గాంధీల కుటుంబానికి రాయ్‌బరేలీ కంచుకోట. కీలకమైన స్థానాన్ని వదులుకోవడం ఇష్టంలేక వయనాడ్ స్థానాన్ని ఖాళీ చేశారు. దాంతో ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వయనాడులో పోటీతో తన లక్ పరీక్షించుకోనున్నారు.