Prime Minister Narendra Modi Nomination : అతిరథ మహారథులు, రాజకీయ ఉద్దండులు, 12 మంది ముఖ్యమంత్రులు, ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు సమక్షంలో ప్రధానమంత్రి మోదీ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా సాగింది. ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు అనంతరం ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వరకు చేరుకున్న మోది... అక్కడి నుంచి ఒంటరిగానే కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్ వేశారు.
వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీ... కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మోదీపై అజయ్‌రాయ్ అనే కాంగ్రెస్ నేత పోటీలో ఉన్నారు. 2014లో వడోదర, వారణాసిలోపోటీ చేసిన మోదీ 2019, 2024లో మాత్రం వారణాసి నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆరు లక్షలకుపైగా మోజార్టీ వస్తే 2014లో నాలుగు లక్షలకుపైగ మోజార్టీ వచ్చింది.
వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీ... కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మోదీపై అజయ్‌రాయ్ అనే కాంగ్రెస్ నేత పోటీలో ఉన్నారు. 2014లో వడోదర, వారణాసిలోపోటీ చేసిన మోదీ 2019, 2024లో మాత్రం వారణాసి నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆరు లక్షలకుపైగా మోజార్టీ వస్తే 2014లో నాలుగు లక్షలకుపైగా మోజార్టీ వచ్చింది.
మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని ముందస్తు ప్రమాణ స్వీకార కార్యక్రంగా నిర్విహిస్తోంది బీజేపీ. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మిత్ర పక్షాల ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా కార్యక్రమానికి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ నామినేషన్ ప్రక్రియలో భాగమయ్యారు.
నామినేషన్ వేయడానికి ముందు ఈ ఉదయం ప్రత్యేక పూజలు చేశారు మోదీ. ఉదయం గంగాదేవి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడ వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. గంగాదేవికి చీరసారె సమర్పించారు. అనంతరం క్రూయిజ్‌లో వెళ్లి కాళభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బీజేపీ ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు.
సుమారు ఆరు కిలోమీటర్ల మేర సాగిందీ మోదీ నామినేషన్ ర్యాలీ. ర్యాలీ రథంపై మోదీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. దారి పొడవునా బీజేపీ శ్రేణులు మేళతళాలు, పూలు, జైజై ధ్వానాల మధ్య మోదీకి స్వాగతం పలికారు.