ABP  WhatsApp

PM Modi: న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలి: ప్రధాని మోదీ

ABP Desam Updated at: 30 Apr 2022 04:50 PM (IST)
Edited By: Murali Krishna

PM Modi: న్యాయస్థానాల్లో స్థానిక భాషల వినియోగానికి అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలి: ప్రధాని మోదీ

NEXT PREV

PM Modi: న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్థానిక భాషలను ఉపయోగిస్తే సామాన్యులకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 



న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. దీనివల్ల న్యాయ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం పెరగడం మాత్రమే కాకుండా తాము మరింత సన్నిహితమయ్యామనే భావన వారికి కలుగుతుంది. -                                                          ప్రధాని నరేంద్ర మోదీ


ఆ చట్టాల రద్దు


కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రులను మోదీ కోరారు. ప్రస్తుత కాలానికి సరిపడని సుమారు 1,800 చట్టాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. వీటిలో 1,450 చట్టాలను రద్దు చేశామన్నారు. అయితే ఇటువంటి 75 చట్టాలను మాత్రమే రాష్ట్రాలు రద్దు చేశాయన్నారు.  


ఈ కార్యాక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.



ఓ చట్టం రూపొందించాలంటే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలి. బాధితుల ఆశలు, అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. న్యాయమూర్తులు కూడా విధి నిర్వహణలో తమ పరిమితులను గుర్తుంచుకోవాలి. లక్ష్మణ రేఖను దాటొద్దు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలకు రాజ్యాంగం వేర్వేరు అధికారాలను కల్పించింది. ప్రజాస్వామ్య బలోపేతానికి, సామరస్యంగా కార్యకలాపాలు సాగేందుకు ఇది దోహదం చేస్తుంది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఇవి వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోయాయి.  "
-                                                       జస్టిస్ ఎన్‌వీ రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి






 




Also Read: CJI NV Ramana: సీఎం- న్యాయమూర్తుల సదస్సు ప్రారంభం- సీఎం జగన్ హాజరు, కేసీఆర్ డుమ్మా!


Also Read: Morth Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలను సర్కార్ బ్యాన్ చేసిందా?

Published at: 30 Apr 2022 04:44 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.