18 ఏళ్ల వయస్సులో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు ఓ వ్యక్తి. 12 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ జైల్లో ఉన్నట్టు తెలిసింది. అయితే అతడు చనిపోయాడనుకున్నారు కుటుంబ సభ్యులు. ఖర్మకాండలు కూడా జరిపించేశారు. తప్పిపోయిన వ్యక్తి.. భార్య.. ఇక తన భర్తలేడు కదా అనుకుని.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే..


బిహార్ కు చెందిన మసాహర్ అనే వ్యక్తికి మనసులో బాగా లేదని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అతడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సమయంలో అతడి వయసు 18 సంవత్సరాలు. అప్పటికే అతడికి పెళ్లైంది. చిన్న వయసులో పెళ్లి కావడంతోపాటు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అతడి కోసం.. చాలా వెతికారు. కానీ లాభం లేకుండా పోయింది. ఇక మనసు బాగలేదు కదా.. ఎక్కడో చనిపోయి ఉంటాడు అనుకున్నారు కుటుంబ సభ్యులు. ఖర్మకాండలు జరిపించారు. అతడి భార్య కూడా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 


అయితే ఇప్పుడు అతడు బతికే ఉన్నాడని తెలిసింది. అది కూడా పాకిస్థాన్ జైల్లో ఉన్నాడని సమాచారం అందింది. ఈ మేరకు స్థానిక పోలీసులు.. మనసాహర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడికి చెందిన ధృవీకరణ పత్రాలు.. విదేశాంగ నుంచి.. ఆయన ఇంటికీ వచ్చాయి. వచ్చిన పత్రాల్లో మనసాహర్ ఫొటో చూసి.. ఇంట్లో వాళ్లు గుర్తు పట్టారు. 


అసలు మనసాహర్ పాకిస్థాన్ కు ఎందుకు వెళ్లాడనేది తెలియాల్సి ఉంది. అక్కడికి వెళ్లి .. ఎందుకు పట్టుబడ్డాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  


Also Read: Marriage: పెళ్లిలో రూ.10 లక్షలు డిమాండ్ చేసిన వరుడు.. వీపు విమానం మోత మోగించిన వధువు కుటుంబం


Also Read: Agni Prime Missile : 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇక గురి తప్పదు.. అణుబాంబులను తీసుకెళ్లే అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్ !


Also Read: Global Spam Report 2021: ఇండియాలో పాపులర్‌ స్కామ్‌ ఏంటో తెలుసా? అకౌంట్లో మీ డబ్బు జాగ్రత్త!!


Also Read: Karthika Deepam December 18 Episode: మోనితకి విశ్వరూపం చూపించిన సౌందర్య, రుద్రాణితో డాక్టర్ బాబు ఛాలెంజ్, అర్థరాత్రి పిల్లల్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్ ను చూసి కంగారు పడిన దీప, కార్తీకదీపం డిసెంబరు 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి