మహిళా రిజర్వేషన్‌ బిల్‌కి రాష్ట్రపతి ఆమోదం, ఇక అమలు చేయడమే తరువాయి

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్‌కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

Continues below advertisement

Women's Reservation Bill: 

Continues below advertisement


మహిళా రిజర్వేషన్ బిల్‌కి ఆమోదం..

ఇటీవల జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రెండు సభల్లోనూ మహిళా రిజర్వేషన్‌ బిల్‌ (Women's Reservation Bill) పాస్ అయింది. దీనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. నారీ శక్తి వందన్ యాక్ట్ (Nari Shakti Vandan Act) పేరుతో ఈ బిల్‌ని ప్రవేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 20న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టగా..రెండు సభల్లోనూ పాస్ అయింది. ఆ తరవాత ఆమోద ముద్ర వేసేందుకు రాష్ట్రపతికి పంపింది కేంద్రం. దీన్ని పరిశీలించిన ద్రౌపది ముర్ము అప్రూవ్ చేశారు. కేంద్రం దీనిపై అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో 33% మేర మహిళలకే సీట్‌లు కేటాయిస్తారు. పార్లమెంట్‌లో ఈ బిల్ పాస్ అయినప్పుడే ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా మహిళలకు న్యాయం చేసినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. 

 

Continues below advertisement