Pralhad Joshi Education Minister | న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాక్రోచ్ జనతా పార్టీ, జెన్ జీ ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీక్ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్రం సుమోటోగా తీసుకుని, సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తుందని రాజీనామా తరువాత ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖదన అదనపు బాధ్యతలను అప్పగించారు. కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం శనివారం తమ డిమాండ్లు అంగీకరించడంతో నీట్ వివాదంపై చేపట్టిన తమ ఆందోళనను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది. జంతర్ మంతర్ నుంచి మొదలుకుని దేశవ్యాప్త నిరసనలు, విద్యార్థుల డిమాండ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకున్నారు. దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొదట తన పదవికి రాజీనామా చేయగా, ఇప్పుడు ప్రధాని మోదీ దానిని ఆమోదించారు.
వాంగ్ చుక్ దీక్ష విరమణ..శనివారం మధ్యాహ్నం పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానికి తన రాజీనామాను సమర్పించారు. గత నెల రోజులుగా పేపర్ లీక్ వ్యవహారం, అస్తవ్యస్త విద్యా వ్యవస్థపై విద్యార్థులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. దేశంలోని ఇతర ప్రాంతాలలో విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం తమ గళాన్ని బలంగా వినిపించారు. వీరే కాకుండా జంతర్ మంతర్ వద్ద పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేశడం తెలిసిందే. మోదీ ప్రకటన, ప్రభుత్వ హామీ తర్వాత ఆయన తన నిరాహార దీక్షను విరమించారు.
ఉత్సహంగా సీజేపీ.. యువతకు కీలక సూచనలుఇటు, ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ జనతా పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు చేసుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు సీజేపీ యొక్క ఇతర డిమాండ్లను కూడా ప్రభుత్వం అంగీకరించింది. జూలై 20న ఢిల్లీలో జరిగిన పార్లమెంట్ మార్చ్‌పై పోలీసుల నిర్బంధ చర్యల తర్వాత దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఉధృతమైంది. అయితే ఆ తర్వాత స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి, విద్యార్థుల డిమాండ్లు సమర్థనీయమైనవని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని, పేపర్ లీక్ పై కఠిన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ ఆందోళనను విరమిస్తున్నట్లు సీజేపీ నేతలు ప్రకటించారు. మూడు విడతల చర్చల తర్వాత ప్రభుత్వం, సీజేపీ మధ్య అంగీకారం కుదిరింది.
మొదట్నుంచీ బాధ్యత తీసుకున్నాను.. ముఖం చాటేయలేదు: ధర్మేంద్ర ప్రధాన్ధర్మేంద్ర ప్రధాన్ 'నేను నా రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపాను. నేను మొదటి రోజు నుంచే బాధ్యత తీసుకున్నాను. ఇలాంటి పరిస్థితులకు ముఖం చాటేయలేదు. గత 10 రోజుల పరిణామాలు నా మనసును కలచివేశాయి. ఇది నాకు వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం మాత్రం కాదు' అని ఆయన అన్నారు.
