Prakash Raj: కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే బెంగళూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా నుంచి తన పేరు మాయమైందని నటుడు ప్రకాష్‌రాజ్ వెల్లడించారు. ఆగస్టు 11న ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఒక వీడియోను పోస్టు చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అనర్హుల తొలగింపు ప్రక్రియలో భాగంగా సుమారు 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారు. అందులో తన పేరు కూడా ఉండటం ఒక జోక్ అని ఆయన అభివర్ణించారు. 

Continues below advertisement

ప్రకాష్ రాజ్ ప్రశ్నలు 

తన వీడియో సందేశంలో ప్రకాష్‌ రాజ్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. " నేను ఇదే నియోజకవర్గంలో పుట్టాను, ఇక్కడే పెరిగాను, నా పాఠశాల విద్య, కళాశాల, థియేటర్ ఆర్ట్స్ అన్నీ ఇక్కడే సాగాయి. చివరకు నేను ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశాను. అలాంటి నా ఓటు  హక్కును తొలగించడం ఆశ్చర్యం" అని అన్నారు. 

ఈ విషయాన్ని కేవలం ఒక సాంకేతిక లోపంగా చూడకుండా, రాజకీయ కోణంలో ఆయన విమర్శలు చేశారు. తన టును తిరిగి పొందే ప్రక్రియ ఏంటో తాను చూస్తానని, గేమ్‌ అన్ అంటూ అధికారులకు, పాలకులకు సవాల్ విసిరారు. " మీకు ఓటు వేయని పౌరుల ఓటు హక్కును మీ అధికారంతో అడ్డుకోగలరేమో కానీ మిమ్మల్ని గద్ద దింే ప్రజాశక్తిని ఆపగలరా?" అంటూ ప్రశ్నించారు. 

Continues below advertisement

సర్ ప్రక్రియ అంటే ఏంటీ?

ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను చేపట్టింది. ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచడానికి మరణించిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉన్న సందర్భాలు లేదా నివాసం మారిన వారి వివరాలను పరిశీలించి జాబితాను అప్‌డేట్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎవరి పేర్ల మీదైనా అభ్యంతరాలు ఉంటే, సంబంధిత ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌ విషయంలో కూడా ఇదే జరిగిందని, ఆయన తన ఓటును పునరుద్దరించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం. 

ఓటు హక్కును పక్కన పెడితే ప్రకాష్‌ రాజ్ ఇటీవల జార్ఖండ్‌ రాజధాని రాంచీలో విద్యార్థులపై లాఠీచార్జీని కూడా తీవ్రంగా ఖండించారు. జేపీఎస్సీ, జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థుల అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినప్పుడు పోలీసులు టియర్ గ్యాస్‌ గోళాలు ప్రయోగించారు. ఆయన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాష్‌ రాజ్‌ సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఆయన డెకాయిట్‌, జన నాయగన్, దృశ్యం 3లో కనిపించారు. రాబోయే కాలంలో ఆయన భారీ ప్రాజెక్టుల్లో కనిపించనున్నారు. ఎస్‌ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి, సందీప్‌ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్‌ చిత్రంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.