PM Modi in US Meets Elon Musk: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో తొలిరోజే ఓ అద్భుతమైన మీటింగ్ జరిగింది. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత్ లో పెట్టుబడులు, టెక్నాలజీ విషయంలో సహాయం తదితర అంశాలపై ఇద్దరి మధ్య జరిగింది. 


టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలన్ మస్క్ బుధవారం (జూన్ 21) ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు, ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. న్యూయార్క్‌లో ప్రధాని మోడీతో సమావేశం అనంతరం ఎలన్ మస్క్ మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధానికి దేశాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి టెస్లాను రమ్మని ఆహ్వానించారని అన్నారు.






మోదీతో మీటింగ్ తర్వాత మాట్లాడిన ఎలన్ మస్క్...తాను మోదీకి అభిమానినని చెప్పారు. ప్రధాని మోదీతో సమావేశం చాలా ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగిందన్న మస్క్..త్వరలో భారత్ పర్యటనను రానున్నట్లు ప్రకటించారు. స్టార్ లింక్ ఇంటర్నెట్ ను ఇండియాకు తీసుకురావటం ద్వారా మారుమూల పల్లె ప్రాంతాలకు ఇంటర్నేట్ సేవలను అందించేందుకు అవకాశంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు మస్క్ తెలిపారు.






ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌, ఆ దేశంలో చాలా అవకాశాలు ఉన్నాయి. దేశం పట్ల ప్రధాని మోదీకి కూడా చాలా శ్రద్ధ ఉంది. అందుకే భారత్ రావాలని ఆయన ఒత్తిడి చేస్తున్నారు. అందుకే భవిష్యత్ ఇండియాను తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం మోదీ తమ ఫ్రెమాంట్ కర్మాగారాన్ని సందర్శించారని 2015 నాటి విషయాన్ని గుర్తు చేశారు మస్క్‌.






ఎలన్ మస్క్ మాట్లాడుతూ మోదీ నిజంగా దేశం కోసం మంచి పనులు చేయాలనుకుంటున్నారని నేను చెప్పగలను. కొత్త కంపెనీలను ఓపెన్ మైండ్‌తో ఆహ్వానించి వారికి అండగా నిలవాలనుకుంటున్నారు. భారత్‌కు ప్రయోజనం కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


ట్విటర్‌ విషయంపై కూడా మస్క్ మాట్లాడారు. "స్థానిక ప్రభుత్వ నియమాలకు కట్టుబడి ఉండటం తప్ప ట్విట్టర్‌కు వేరే మార్గం లేదు. మేము ఆయా ప్రభుత్వ చట్టాలను పాటించకపోతే, సంస్థను మూసివేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం చేయగలిగినది ఉత్తమమైంది. ఏ దేశంలోనైనా చట్టానికి అనుగుణంగా పనిచేయడం, అంతకు మించి చేయడం అసాధ్యం. చట్టం ప్రకారం సాధ్యమయ్యే వాక్‌స్వేచ్ఛను అందించడానికి మేము మా వంతు కృషి చేస్తాం" అన్నారు. 






ఎలాన్ మాస్క్ మాట్లాడుతూ, "నేను వచ్చే ఏడాది భారత్‌లో సందర్శించాలని ప్లాన్ చేస్తున్నాను. టెస్లా భారతదేశంలోకి ప్రవేశించబోతుందని విశ్వసిస్తున్నాను. మద్దతు ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో భారతదేశంలో గణనీయమైన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది."


Join Us on Telegram: https://t.me/abpdesamofficial