PM Narendra Modi Mann Ki Baat Highlights: దేశం ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని, 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుందని
ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 87వ ఎపిసోడ్‌లో జాతినుద్దేశించి మాట్లాడుతూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పలు రంగాల్లో భారత్ ముందంజలో ఉందని, భవిష్యత్‌లోనూ ఇదే తీరుగా పనిచేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
‘400 బిలియన్ డాలర్ల ఎగుమల లక్ష్యాన్ని భారత్ సాధించింది (Indian exports achieved target USD 400 billion). ఇది భారత్ విలువ, సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. దేశంలో తయారైన ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ రోజురోజుకూ మెరుగవుతోంది. ప్రపంచ మార్కెట్‌లో భారత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం శుభసూచకం’ అని మన్ కీ బాత్ రేడియో ప్రోగ్రాంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
ప్రభుత్వ పోర్టల్‌తో మెరుగైన విక్రయాలు..
‘గతంలో భారత్ ఎగుమతుల విలువ 100 బిలియన్ అమెరికా డాలర్లు ఉండేది. ఆపై 150 బిలియన్లు, మరింతగా శ్రమించి 200 బిలియన్ డాలర్లకు చేరుకున్నాం. ఇప్పుడు భారత్ ఏకంగా 400 బిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి చేస్తోంది. ఇది దేశ ప్రజలు గర్వించే విషయం. తమిళనాడు అరటిపండ్లు, హిమాచల్ ప్రదేశ్ నుంచి చిరుధాన్యాలు, లడఖ్ నుంచి కూరగాయలు, ఎన్నో రకాల పండ్లతో పాటు మేకిన్ ఇండియాలో భాగంగా ఉత్పత్తయ్యే వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. గతంలో పెద్ద పెద్ద వాళ్లు మాత్రమే తమ ఉత్పత్తులను భారీ ఎత్తున విక్రయించేవాళ్లు. GeM పోర్టల్ ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది.
మార్చి 23న భారత్ సరికొత్త చరిత్ర..
డెన్మార్క్, దక్షిణ కొరియా, లండన్, కెన్యా లాంటి దేశాలకు భారత్ నుంచి వస్తువులు, ఇతర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. వోకల్ ఫర్ లోకల్ అనేది త్వరలోనే లోకల్ టు గ్లోబల్ అయ్యే పరిస్థితిని భారత్ నుంచి చూడవచ్చు. చిరు వ్యాపారులు సైతం ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ GeM ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. మార్చి 23న 400 బిలియన్ డాలర్ల ఎగుమతి విలువను చేరుకుని భారత్ సరికొత్త చరిత్రకు నాంది పలికిందని’ ప్రధాని మోదీ ప్రస్తావించారు.
దేశం నుంచి గంటకు సగటున 46 మిలియన్ల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రతిరోజూ దాదాపుగా 1 బిలియన్ ప్రొడక్ట్స్ ఎగుమతి చేస్తుండగా, నెలవారీగా చూసుకుంటే ఆ విలువ 33 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా, 2020-21 ఏడాదిలో 292 బిలియన్ డాలర్ల ఉత్పత్తులును భారత్ ఎగుమతి చేసింది. తాజాగా 2021-22 ఏడాదికిగానూ 37 శాతం పెరుగుదలతో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులకు చేరుకుంది.
Also Read: ONOD Project: తెలుగు వ్యక్తికి అరుదైన అవకాశం, వన్ నేషన్ వన్ డేటా ప్రాజెక్టుకి చీఫ్‌గా నియామకం
Also Read: Intenational Flights Resume: విమాన ప్రయాణికులకు శుభవార్త - రెండేళ్ల తరువాత ఆ ఫ్లైట్స్ సేవలు ప్రారంభం