PM visit To Many States Including Assam: సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ(PM Narendramodi) ప‌లు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో శ‌నివారం(Saturday) ఒక్క‌రోజే 4 రాష్ట్రాల్లో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు. తొలుత శనివారం ఉదయం అస్సాం(Assam)లోని కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 'జీప్ సఫారీ' తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఆవిష్కరించనున్నారు. నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను సందర్శించ‌నున్నారు. శ‌నివారం వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌, సిక్కింల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. తొలుత అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ సందర్శనతో ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో `విక‌సిత భారత్ - విక‌సిత‌ నార్త్ ఈస్ట్' కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆయ‌న “సెల టన్నెల్” ను ప్రారంభించి, సుమారు ₹10,000 కోట్ల విలువైన ఉన్న‌తి(UNNATI) పథకాన్నిప్రారంభిస్తారు. 


ప‌ర్య‌ట‌న‌లు సాగేది ఇలా.. 


అస్సాం: మొఘలులపై సాధించిన విజయాన్ని పురస్కరించుకుని అస్సాంలోని అహోం రాజ్యానికి చెందిన రాయల్ ఆర్మీకి చెందిన ప్రఖ్యాత జనరల్ లచిత్ బోర్ఫుకాన్ గౌరవార్థం 84 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. జోర్హాట్‌లో, ఆరోగ్యం, చమురు మరియు గ్యాస్, రైలు మరియు గృహనిర్మాణ రంగాలను బలోపేతం చేయడానికి అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించి, అంకితం చేయ‌నున్నారు.


అరుణాచల్ ప్రదేశ్: ఇటానగర్‌లో జరిగే కార్యక్రమంలో మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభిస్తారు.  ఈ కార్యక్రమాలు రైలు, రోడ్డు, ఆరోగ్యం, హౌసింగ్, విద్య, సరిహద్దు మౌలిక సదుపాయాలు, IT, పవర్ మరియు చమురు, గ్యాస్ వంటి వివిధ రంగాలలో విస్తరించి ఉన్నాయి. ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్‌లో రూ.41,000 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి అంకితం చేయనున్నారు.


 పశ్చిమ బెంగాల్: సిలిగురిలో ``విక‌సిత‌ భారత్- విక‌సిత పశ్చిమ బెంగాల్" కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆయన రైలు, రోడ్డు రంగాలలో సమిష్టిగా రూ.4,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, అంకితం చేస్తారు.


ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి మోడీ ఉత్తరప్రదేశ్‌లో రూ.42,000 కోట్ల విలువైన‌ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయ‌నున్నారు. అదేవిధంగా ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. 


మీరు కూడా రండి!


కజిరంగా నేషనల్ పార్క్ వద్ద ఏనుగులకు చెరకును తినిపించిన ప్రధాన మంత్రి అసోంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడ‌ అక్కడి ఏనుగులకు చెరకు తినిపించారు. లఖిమాయి, ప్రద్యుమ్న, ఫూల్మాయిలకు చెరకు తినిపించారు. కాజిరంగా ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. అయితే అక్కడ అనేక ఇతర జాతులతో పాటు పెద్ద సంఖ్యలో ఏనుగులు కూడా ఉన్నాయి. కాజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించాలని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రజలను కోరారు.  అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించి ప్రకృతి దృశ్యాల అందాలను అనుభవించాలని ప్రజలను కోరారు. అస్సాం ప్రజల ఆతిథ్యాన్ని స్వీక‌రించాల‌ని సూచించారు.  అస్సాం హృదయంతో మిమ్మల్ని  కలుపుతుంది అని పేర్కొన్నారు. 


అస్సాంలోని జోర‌హాట్‌లో నిర్వ‌హించిన 'లఖపతి బైడియో' పథకం లబ్ధిదారులతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌త్య‌క్షంగా పాల్గొన్నారు.  జోర్హాట్‌లోని మెలెంగ్ మెటెలి ఫీల్డ్‌లో “లఖపతి బైడియో” పథకం లబ్ధిదారులతో ఆయ‌న సంభాషించారు. అనంత‌రం, రూ. 17,500 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులను ఆవిష్కరించారు.  ఈ ప్రాజెక్టులు ఆరోగ్యం, చమురు మరియు గ్యాస్, రైలు మరియు గృహ రంగాలను బలోపేతం చేయడం, రాష్ట్ర మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. “ఈ ఉదయం నేను అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో ఉన్నాను. దట్టమైన పచ్చదనం మధ్య ఉన్న ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గంభీరమైన ఒక కొమ్ముల ఖడ్గమృగంతో సహా విభిన్న వృక్షజాలం, జంతుజాలంతో ఆశీర్వదించబడింది. అని మోదీ  పేర్కొన్నారు. 


PMAY కింద 5.5 లక్షల ఇళ్లకు ప్రధానమంత్రి 'గృహ ప్రవేశం' నిర్వహించారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన(ప్రధాన‌ మంత్రి ఆవాస్ యోజన) కింద నిర్మించిన 5.5 లక్షల ఇళ్లకు మోడీ గృహ‌ప్ర‌వేశాలు నిర్వ‌హించారు. శివసాగర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తారు.