Ayodhya deepotsav,Amazing and unforgettable : అయోధ్య దీపోత్సవం అద్భుతమని, మరుపురానిదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. దీపావళి (Diwali) సందర్బంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya) నగరం దివ్వెల వెలుగుల్లో ధగధగలాడింది. సరయూ నదీ తీరంలో నిర్వహించిన దీపోత్సవ్‌ (Deepotsav)లో ఒకేసారి 22.23 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. దీపోత్సవానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

శ్రీరాముడు దేశ ప్రజలందరికీ మేలు చేయాలని, కుటుంబ సభ్యులందరికీ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. లక్షలాది దీపాలతో అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవంతో దేశమంతా దేదీప్యమానంగా వెలిగిపోయిందన్నారు. దీని నుంచి వెలువడే శక్తి దేశమంతటా కొత్త ఉత్సాహాన్ని పంచుతోందన్నారు. గత ఏడాది 15 లక్షల దీపాలు వెలిగించిన రికార్డును.. ఈ ఏడాది అయోధ్య బద్దలు కొట్టింది. ఉత్తరప్రదేశ్ లో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా అయోధ్యలో దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు.

अद्भुत, अलौकिक और
अविस्मरणीय!

लाखों दीयों से जगमग अयोध्या नगरी के
भव्य दीपोत्सव से सारा देश प्रकाशमान हो रहा है। इससे निकली ऊर्जा संपूर्ण
भारतवर्ष में नई उमंग और नए उत्साह का संचार कर रही है। मेरी कामना है कि
भगवान श्री राम समस्त देशवासियों का कल्याण करें और मेरे सभी… pic.twitter.com/3dehLH45Tp

Narendra Modi (@narendramodi) November
12, 2023

2017 నుంచి అయోధ్యలో ఈ దీపోత్సవం జరుగుతోంది. తొలి ఏడాది 51వేల దివ్వెలను వెలిగించగా,  ఆ తర్వాత 2018లో దాదాపు 3లక్షల దీపాలను వెలిగించారు. ఆ ఏడాది దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్‌ జంగ్‌ సూక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2019లో 4.10లక్షలు, 2020లో దాదాపు 6లక్షలు, 2021లో 9లక్షలకు పైగా దీపాలను వెలిగించి యూపీ ప్రభుత్వం గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుంది. గతేడాది ఆ రికార్డును తిరగరాస్తూ 15లక్షల దీపాలను వెలిగించి మరోసారి గిన్నిస్‌ రికార్డును దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరయ్యారు. ఈ ఏడాది మరోసారి ఆ రికార్డును బద్దలుకొట్టి.. సరికొత్త ప్రపంచ రికార్డ్‌ను సృష్టించింది.  50 దేశాలకు చెందిన రాయబారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాం స్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.