PM Modi Speech In Lok Sabha: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై లోక్‌సభలో ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (ఫిబ్రవరి 04, 2025) మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్, రాజీవ్‌ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌, అఖిలేష్‌ యాదవ్‌ లక్ష్యంగా చేసుకున్నారు. తన ప్రసంగం ముగింపులో ఇది తమ మూడో పదవీకాలం మాత్రమే అని కూడా అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది ప్రధాని మోదీ అనగానే సభలో నవ్వులు విరిశాయి.


ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే 20 నుంచి 25 ఏళ్ల కాలం సరిపోతుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఇది తన మూడో పదవీకాలం అని, ఇంకా దేశాభివృద్ధికి సేవ చేస్తూనే ఉంటానని అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను నెరవేర్చుకోవడానికి నేడు దేశం చాలా వేగంగా ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఇది తమ ప్రభుత్వ కల మాత్రమే కాదని దేశంలోని ప్రతి పౌరుడి కలగా అభివర్ణించారు. 


'2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశంగా ఉంటాం'
"ప్రపంచంలోని అనేక దేశాలు 20 నుంచి 25 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయి." అని ప్రధాని మోదీ అన్నారు. అయితే భారతదేశంలో జనాభా, ప్రజాస్వామ్యం, ఇతర చాలా సౌకర్యాలు ఉన్నాయి. అయినా మనం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నామని ప్రధానమంత్రి మోదీ ప్రశ్నించారు. మేము దీన్ని 2047లో సాధిస్తామన్నారు. మనం సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయన్న మోదీ వాటిని కచ్చితంగా సాధిస్తామమన్నారు. ఇది మా మూడో పదవీకాలం మాత్రమే. దేశ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి తాము రాబోయే కాలంలో కూడా పని చేస్తూనే ఉంటామని అన్నారు. 


Also Read: ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !


ఈ సందర్భంగా, సభలో కూర్చున్న అందరు ఎంపీలను ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రధానమంత్రి, దేశాభివృద్ధి కోసం అన్ని పార్టీలు, అందరు నాయకులు, దేశప్రజలందరూ ఐక్యంగా ఉండాలని తాను కోరుతున్నానని అన్నారు. అన్ని పార్టీలు, నాయకులకు వారి సొంత సిద్ధాంతాలు ఉండవచ్చు కానీ దేశం కంటే ఏదీ గొప్పది కాదు అని అన్నారు. ఈ దేశం అభివృద్ధి చెందినప్పుడు, మన భవిష్యత్ తరాలు 2025లో అక్కడ కూర్చున్న ప్రతి ఎంపీ అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పని చేశారని చెబుతారు అని అన్నారు. 


నరేంద్ర మోదీ రాజీవ్ గాంధీ పేరును ప్రస్తావించకుండానే ఎదురు దాడి చేశారు. "మన దేశంలో ఒక ప్రధానమంత్రి ఉండేవారు, ఆయనను మిస్టర్ క్లీన్ అని పిలవడం ఒక ఫ్యాషన్. ఢిల్లీ నుంచి ఒక రూపాయి వస్తే, ఆ గ్రామానికి 15 పైసలు చేరుతాయని ఆయన బహిరంగంగా చెప్పారు. " అని అన్నారు. అప్పట్లో ఒకే పార్టీ పాలన ఉండేది. అద్భుతమైన చేతి చాకచక్యం చేశారు అని విమర్శలు చేశారు. 


"మేము DBT ద్వారా ప్రత్యక్ష ప్రయోజనాలను అందించడం ప్రారంభించాము. రూ. 40 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయి. సమస్యను పరిష్కరించడం మా ప్రయత్నం, మేము అంకితభావంతో పని చేస్తాము" అని ప్రధాని మోదీ అన్నారు. ఒక విధంగా, 21వ శతాబ్దంలో 25% ఇప్పటికే గడిచిపోయిందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత 21వ శతాబ్దంలోని 25 సంవత్సరాల్లో ఏమి జరిగిందో భవిష్యత్‌ ఎలా ఉంటుందోకాలం నిర్ణయిస్తుందని తెలిపారు. 


'కొంతమంది పేదరికాన్ని చూడలేదు'
ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ప్రతిపక్షంలోని కొంతమంది పేదరికాన్ని చూడలేదని. వర్షాకాలంలో పూరి గుడిసెలో పైకప్పు లేదా ప్లాస్టిక్ పైకప్పు కింద జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పటి వరకు, 4 కోట్లు పేదలకు ఇళ్లు ఇచ్చాం. 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి  మహిళల సమస్య పరిష్కారించాం."


Also Read: కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే?


'12 కోట్ల కుటుంబాలకు కుళాయి నీరు అందిచాం' అని ప్రధాని మోదీ అన్నారు, "ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించడంపై మా దృష్టి ఉంది. 16 కోట్ల ఇళ్లకు కుళాయి కనెక్షన్ లేదు, మా ప్రభుత్వం 12 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటిని అందించింది. మా స్వచ్ఛతా అభియాన్‌ను ఎగతాళి చేశారని, కానీ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల నుంచి అమ్ముడైన చెత్తతో ప్రభుత్వ ఖజానాకు రూ. 2300 కోట్లు తీసుకువచ్చింది" అని ఆయన అన్నారు.
పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తన స్పందన తెలిపారు. "ప్రధాని మోడీ ప్రజల నుంచి, వారి అవసరాల నుంచి దూరమయ్యారని నేను భావిస్తున్నాను, ఈరోజు ప్రసంగం నుంచి నాకు అనిపించింది ఇదే" అని ప్రియాంక అన్నారు. 


కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ, ప్రజలు ఢిల్లీలో ఓటు వేయబోతున్నారు. దీని గురించి ఆలోచిస్తూ, మాట్లాడుతున్నారని. అర్బన్ నక్సల్స్ గురించి కూడా సరైనది కాదు" అని అన్నారు. లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, సోనియా గాంధీపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, ప్రియాంక గాంధీ కూడా దానిని స్పష్టంగా చెప్పారన్నారు. ఆమె రాష్ట్రపతిని గౌరవిస్తున్నారని అన్నారు. అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని అదే ప్రధానమంత్రి పార్లమెంటులో పునరావృతం చేస్తున్నారు అని అన్నారు. అనవసరంగా గాంధీ కుటుంబాన్ని తిట్టడం, పార్లమెంట్ సమయం దుర్వినియోగం చేయడం, ఇది కూడా ఒక ప్రసంగమేనా? అని అభిప్రాయపడ్డారు. 


2014 తర్వాతే అఖండ భారత్ ఏర్పడిందా- ప్రియాంక చతుర్వేది
ప్రధాని మోదీ ప్రసంగంపై శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ "ప్రతిపక్షం గురించి మాట్లాడటం, ప్రతిదానికీ ప్రతిపక్షాన్ని నిందించడం తప్ప బాధ్యతల గురించి మాట్లాడటం లేదు. నిరుద్యోగం రికార్డులను బద్దలు కొట్టింది, ద్రవ్యోల్బణం పెరిగింది. మీరు యువతను నిరుద్యోగులుగా మార్చారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయలేదు, కానీ దాని గురించి ప్రస్తావించలేదు, మీరు న్యాయవ్యవస్థ, ఈసీ, సీబీఐ, ఈడీ, ఐటీని బలహీనపరిచారు, కానీ దాని గురించి ప్రస్తావించలేదు. సానుకూలl 2014 తర్వాతే జరిగినట్లుగా మాట్లాడారు. 2014 తర్వాతే అది ఐక్య భారతదేశంగా మారింది. మనకు 2014 తర్వాతే స్వాతంత్ర్యం వచ్చింది. 2014 తర్వాతే గణతంత్ర దేశంగా మారింది 2014 తర్వాతే రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాబట్టి, ఇది వ్యవస్థాపక పితామహులకు అవమానం." అన్నట్టు మాట్లాడుతున్నారు.