PM Modi Exclusive Interview on ABP News | న్యూఢిల్లీ: ఇప్పటివరకూ 6 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. చివరిదైన 7వ ఫేజ్ పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ABP నెట్‌వర్క్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించారు. ఈ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోల్ మేనేజ్‌మెంట్, ఎన్నికల వ్యూహాలు, ప్రతిపక్షాలతో పాటు పలు విషయాలపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీపీ ఆనందకు చెందిన సుమన్ డే, ఏబీపీ న్యూస్ ప్రతినిధులు రోహిత్ సవాల్, రోమన్ ఐసర్ ఖాన్‌లతో జరిగిన ఇంటర్వ్యూలో బెంగాల్‌లో రూ.3000 కోట్లు అవినీతి జరిగిందని, ఆ సొమ్మును రికవరీ చేస్తామన్న మాటకు కట్టుబుడి ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. యూపీఏ హయాంలో ఈడీ కేవలం రూ. 34 లక్షలు సీజ్ చేస్తే, ఎన్డీఏ పాలనలో రూ.2,200 కోట్ల అవినీతి సొమ్మును రికవర్ చేసినట్లు వెల్లడించారు.


తమ ప్రభుత్వ అవినీతిని అరికట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. ఏ రాజకీయ పార్టీతోనే, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అన్ని అవినీతి చేపలు గాలానికి చిక్కుతాయని చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) లాంటి దర్యాప్తు సంస్థల ప్రయత్నాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడా నేతలను సైతం దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టడం లేదని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. 


అవినీతిపరుల భరతం పట్టామన్న ప్రధాని మోదీ 
తమ హయాంలో అవినీతి అనేది లేకుండా చేశామన్న మోదీ.. 2004 నుంచి 2014 వరకు ఈడీ కేవలం రూ.34 లక్షలు సీజ్ చేస్తే.. ఎన్డీఏ హయాంలో 2014 నుంచి 2024 వరకు రూ.2,200 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. నల్లధనంపై తాము ఉక్కుపాదం మోపడం ద్వారా కరెన్సీ నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటకు కనిపించాయన్న నిజాన్ని ఎవరూ కాదనలేరని వ్యాఖ్యానించారు. పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయం పట్ల నిబద్ధత ఉంటే సుపరిపాలన సాధ్యమని అభిప్రాయపడ్డారు. పెద్ద పెద్ద నేతలు జైలుకు వెళ్లారని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని నిరూపించామన్నారు. 



రికవరీ చేసిన సొత్తు ప్రజలకు చెల్లిస్తాం.. 
కొందరు పెద్దలు అక్రమంగా దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు అందించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని మోదీ తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు తమ ఖజానాలో డబ్బులేదు, కానీ కొందరు దోచుకునేందుకు ప్రయత్నాలు ఆపడం లేదని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొందరు పెద్దలు దోచుకున్న సొమ్మును రికవరీ చేసి, తిరిగి ప్రజలకు పంచడం సాధ్యమే. బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అవినీతిని ఎత్తిచూపారు. బిహార్‌లో ఉద్యోగాల కోసం ముందుగానే భూమి ఇస్తుండగా, బెంగాల్‌లో జాబ్స్ తెచ్చుకోవడానికి ఓ రేటు ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. దానివల్ల అర్హులైన వారు నిరుద్యోగులుగా రోడ్డున పడితే, అనర్హులు, టీచర్, ఇతర అధికారులుగా మారి దోచుకుంటున్నారని ఆరోపించారు.
Also Read: PM Modi Exclusive Interview: భారత్‌ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతాం, NDA 3.0తో రోడ్ మ్యాప్ రెడీ: ప్రధాని మోదీ


ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఓ ప్రభుత్వం రూ. 3,000 కోట్లను జప్తు చేయగా, రూ. 1.25 లక్షల కోట్ల విలువైన ఆస్తులను సైతం సీజ్ చేసింది. కేరళలో, ఎల్‌డిఎఫ్ సభ్యులు నడుపుతున్న సహకార బ్యాంకులో పెద్ద స్కామ్ జరిగింది. మధ్యతరగతి వాళ్లు కూడబెట్టిన డబ్బు కొందరి పరం కాకుండా ఉండాలని, నిందితుడి ఆస్తిని అటాచ్‌ చేయాలని ఆదేశించినట్లు గుర్తుచేసుకున్నారు. రికవరీ చేసిన సొమ్ములో రూ.1700 కోట్లు ప్రజలకు తిరిగి ఇచ్చేశాం, వారి డబ్బు వాళ్లకే చేరాలన్నారు. 


Also Read: మత ఆధారిత రిజర్వేషన్ అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే, ఓబీసీ కోటాతో ఓటు బ్యాంక్ పాలిటిక్స్: ప్రధాని మోదీ