Mini Diwali In Narendra Modi House: అయోధ్యలోని రామాలయం (Ayodhya Ram Mandir) గర్భగుడిలో శ్రీరాంలల్లా నూతన విగ్రహ ప్రతిష్ఠాపన (Ram Lalla Pran Pratishtha) సోమవారం అంతరంగ వైభవంగా పూర్తయింది.
బాలరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేశారు. దేశ విదేశాలలో లక్షలాది మంది రామభక్తులు వేడుకలకు తరలివచ్చారు.
దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీపాలు వెలిగించారు. అయోధ్యలో సరయు నదీ తీరాన దీపోత్సవం నిర్వహింన్నారు.
అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో 'మినీ దీపావళి' జరుపుకున్నారు.
అయోధ్య ఆలయం నుంచి తీసుకొని వచ్చిన రాముని ఫోటో ముందు రామ్ జ్యోతి (Ram Jyoti) పేరుతో మట్టి దీపాలు వెలిగించారు.
దీనికి సంబంధించిన ఫొటోలను X లో పంచుకున్నారు. అలాగే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన నివాసంలో 'రామ్ జ్యోతి'ని వెలిగించారు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన నివాసంలో దీపాలు వెలిగించారు. దివ్యాంగ విద్యార్థులతో కలిసి మంత్రి, ఆయన కుటుంబం సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పూజలకు సంబంధించిన వీడియలోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.