PM Kisan Yojana : పీఎం కిసాన్ యోజన డబ్బులు కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శనివారం ఉదయం రైతుల ఖాతాల్లో డబ్బులు వేయబోతోంది కేంద్రం. 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20 వేల కోట్లకుపైగా నిధులను బదిలీ చేయబోతోంది. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులు విడుదల చేస్తారు.
రైతుల ఖాతాల్లో రెండు వేలు జమ
అర్హులైన రైతులందరికీ పిఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి రూ.6,000 సహాయం కేంద్రం అందిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 17 విడతలుగా నిధులు అందిస్తూ వచ్చింది. 17వ విడత మొన్న జూన్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు 18 విడత నిధులు శనివారం(అక్టోబర్ 5న) విడుదల చేయనుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతు ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది కేంద్రం. 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులంతా ఈ పథకానికి అర్హులు.
ఈ కేవైసీ తప్పనిసరిగా చేయాలి
పిఎం కిసాన్ యోజన సొమ్ము ఖాతాల్లో జమ చేయాలంటే మాత్రం కేవైసీ తప్పనిసరిగా చేసి ఉండాలి. లేకుండా డబ్బులు వేయడానికి వీలుపడదని అధికారులు చెబుతున్నారు. PM కిసాన్ యోజనకు అర్హులైన రైతులు మూడు విధాలుగా EKYC చేసుకోవచ్చు. OTP-ఆధారిత e-KYC, బయోమెట్రిక్-ఆధారిత e-KYC, నేరుగా బ్యాంకుకు వెళ్లి e-KYC చేసుకోవాల్సి ఉంటుంది.
OTP ఆధారిత e-KYC: ఎలా ఎంచుకోవాలి
1. PM కిసాన్ యోజన వెబ్‌సైట్‌కి వెళ్లి, కిసాన్ కార్నర్ సెక్షన్‌పై క్లిక్ చేస్తే అందులో e-KYC విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
2. అందులో ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. వెంటనే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది దాన్ని అందులో ఎంటర్ చేయాలి.
3. OTPని ఫిల్ చేసిన వెంటనే e-KYC ప్రక్రియ పూర్తి అయినట్టు సమాచారం వస్తుంది.
కొత్త ఈ పథకానికి అర్హులైన వాళ్లు ఈ ప్రక్రియను ఫాలో కావాల్సి ఉంటుంది.
1. నమోదు ప్రక్రియ
ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి రైతులు ముందుగా తన పేరును నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకోకుంటే ప్రయోజనాలు కోల్పోతారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
2. ఆధార్ నంబర్‌కు లింక్ చేయడం
రైతుల భూ రిజిస్ట్రేషన్‌తో ఆధార్ నంబర్ అనుసంధానమై ఉండాలి. అలా లేకపోతే మాత్రం దరఖాస్తు పెండింగ్‌లో ఉంటుంది. ప్రభుత్వం సాయన్ని అందుకోలేరు.
3. భూమి యాజమాన్య హక్కు పత్రాలు
వ్యవసాయ భూమి తనదే అని చెప్పే యాజమాన్య హక్కు పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. భూమి మీది అయినా అది పేరు మీద లేకుంటే మాత్రం పథకానికి అర్హులుకారు.
4. మార్గదర్శకాలను అనుసరించడం
ఇతర వేరే కేంద్రం ఇచ్చే రైతు పథకాల సాయం తీసుకోని వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏదైనా ఇతర పథకం నుంచి ఆర్థిక సహాయం పొందుతే మాత్రం PM కిసాన్ యోజనకు అర్హులు.
Also Read: బీహార్‌లో మారుతున్న సమీకరణాలు - నితీష్ కుమార్ తీరు అనుమానాస్పదం - బీజేపీ జాగ్రత్త పుడుతోందా ?