PM Kisan 24th Installment: దీపావళి పండుగ వేళ దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) యోజన 24వ విడత నిధులను ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేశారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీబటన్ నొక్కి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని జమ చేశారు.

Continues below advertisement

9.34 కోట్లకు పైగా రైతులకు రూ. 18,680 కోట్లు

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, ఈ 24వ విడత కింద దేశవ్యాప్తంగా 9.34 కోట్లకు పైగా అర్హులైన రైతు కుటుంబాలకు రూ. 2,000 చొప్పున జమ అయ్యాయి. ఈ విడత ద్వారా ప్రభుత్వం మొత్తం రూ. 18,680 కోట్లకు పైగా బదిలీ చేసింది. ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున, ఏడాదికి మొత్తం మూడు వాయిదాలలో రూ. 6,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.

మీ ఖాతాలో డబ్బులు పడలేదా?  

మీ మొబైల్‌కు మెసేజ్ రాకపోయినా లేదా ఖాతాలో డబ్బు జమ కాకపోయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్ సర్వర్ల రద్దీ వల్ల కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. ఒక్కొసారి వివిధ కారణాలతో డబ్బు జమ కాకపోవచ్చు.  

Continues below advertisement

1.ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేయకవపోవడం  

2. భూమి రికార్డుల ధృవీకరణ పూర్తి కాకపోవడం 

3. బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ లేకపోవడం  

వివిధ రాష్ట్రాల్లో నిబంధనలను కఠినతరం చేయడంతో, ఈ లోపాల వల్ల దాదాపు 10 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. Also Read: కుంభమేళా 2027: నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ పర్వం పూర్తి షెడ్యూల్, అమృతస్నానాల ప్రాముఖ్యత!

పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి?

  • రైతులు బ్యాంకులు లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా, మొబైల్ ఫోన్ ద్వారానే పీఎం కిసాన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. 
  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ను విజిట్ చేయండి. 
  • హోమ్ పేజీలో ఉన్న 'Know Your Status' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నెంబర్,  క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వచ్చే OTPని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే, మీ చెల్లింపుల వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి.  Also Read: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !