PFI Plea in Supreme Court: 


సుప్రీం కోర్టులో PFI పిటిషన్ 


పాపులర్ ఫ్రంట్ ఇండియా (Popular Front of India Ban)పై ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధులు అందిస్తున్నట్టు తేల్చి చెప్పింది. దేశంలో ఎక్కడా ఆ సంస్థ యాక్టివ్‌గా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ సంస్థను బ్యాన్ చేసింది. అప్పట్లో దీనిపై పలు చోట్ల గొడవలు జరిగాయి. PFI కి చెందిన కార్యకర్తలు కొందరు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకో ర్టుని ఆశ్రయించారు. తమపై కేంద్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది. Unlawful Activities Act (UAPA) కింద UAPA Tribunal తమ సంస్థని బ్యాన్‌ చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎమ్ త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ముందుగా హైకోర్టుకి వెళ్లి పిటిషన్ పెట్టుకుని ఉంటే బాగుండేదని మందలించింది. PFI తరపున అడ్వకేట్ శ్యామ్ దివాన్ వాదించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్ని సమర్థించారు. ముందు హైకోర్టుకి వెళ్లి ఆ తరవాత సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సరైనదే అని వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్ 27న PFIపై నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 8 అనుబంధ సంస్థలపైనా ఆంక్షలు విధించింది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నాయని స్పష్టం చేసింది. 


గతేడాది నిషేధం..


భారత్‌లో పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా సంస్థపై గతేడాది కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పీఎఫ్ఐ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందుకే ఆ సంస్థపై ఈ నిషేధం విధిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో కారణంగా పేర్కొన్నారు. నిషేధం విధించే ముందు కొన్ని రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థ కార్యాలయాలు సహా సభ్యుల ఇళ్లపై వరుస సోదాలు నిర్వహించింది. ఎన్ఐఏ పలువురు పీఎఫ్ఐ లీడర్లను అరెస్టు కూడా చేసింది. దేశంలో మొత్తం 8 రాష్ట్రాల్లో PFI సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులు, సంస్థ ఆఫీసుల్లో సోదాలు కొనసాగాయి.. యూపీ, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, అసోంలో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్ లో ఇంటలిజెన్స్ బ్యూరోతో పాటు సోదాలు జరిగిన రాష్ట్రాల పోలీసులు కూడా సాయం చేశారు.


Also Read: ఢిల్లీలో సరిబేసి విధానం, కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం