CMIE Report On India's Spending: దేశంలో కాలక్రమేణా ప్రజల జీవనశైలి నుంచి ఆహారం వరకు పెద్ద మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) నివేదిక దేశం అసలు చిత్రాన్ని వివరిస్తుంది. గత సంవత్సరంలో నూనె, ఫ్యాట్ ఫుడ్‌ వినియోగం 19.67 శాతం తగ్గింది. మరోవైపు, చాక్లెట్ వంటి వాటిపై ఖర్చు 19.78 శాతం పెరిగింది.

ఈ నివేదిక గత నాలుగు సంవత్సరాల వివరాలను అందిస్తూ, ప్రజలు ఎలా? ఏ వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారో వివరిస్తుంది. చాక్లెట్లు, జామ్ , చక్కెరపై 2023-24 సంవత్సరంలో 6.60 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నూనె, ఫ్యాట్‌ ఫుడ్‌పై ప్రజలు కేవలం 2.45 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. కూరగాయలపై 5.95 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 

కూరగాయలు-నూనెల కంటే చాక్లెట్లపై ఎక్కువ ఖర్చు

ఇదే విధంగా 2022-23 సంవత్సరంలో ప్రజలు 5.51 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, నూనె, కొవ్వుపై 3.05 లక్షల కోట్ల రూపాయలు, కూరగాయలపై 5.28 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదేవిధంగా, CMIE నివేదిక ప్రకారం, 2021-22 సంవత్సరంలో చాక్లెట్లు, జామ్,  చక్కెరపై 4.71 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, కూరగాయలపై 5.06 కోట్ల రూపాయలు,  నూనె , కొవ్వుపై 2.76 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు ఖర్చు చేశారు.

2020-21 సంవత్సరం గురించి మాట్లాడితే, చాక్లెట్లు, జామ్, షుగర్‌పై   ప్రజలు 4.46 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, కూరగాయలపై 4.79 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదేవిధంగా నూనె, కొవ్వుపై 2.01 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సమయంతోపాటు ప్రజలలో వచ్చిన మార్పులను ఈ డేటా స్పష్టంగా చూపిస్తుంది. దీనితోపాటు, ఆరోగ్యానికి అయ్యే ఖర్చు 18.75 శాతం పెరిగింది, అయితే వినియోగదారుల వ్యయం కూడా 9.72 శాతం పెరిగి 181.4 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.