Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి జరగనున్నాయి. జులై 20వ తేదీ నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీ ఆర్డినెన్స్ సహా 31 బిల్లులు పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుంది. 17 రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టేందుకు కేంద్ర సర్కారు సన్నద్ధమైంది. వర్షాకాల సమావేశాల్లో.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శల దాడులు చేసేందుకు సిద్ధమయ్యారు. మణిపూర్ సంక్షోభం, ఢిల్లీ ఆర్డినెన్స్, ద్రవ్యోల్బణం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి కీలక అంశాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్యలను ఎండగట్టాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి.
పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులు
1. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 20232. సినిమాటోగ్రాఫ్ (సవరణ) చట్టం, 20193. DNA సాంకేతిక చట్టం (ఉపయోగం మరియు అప్లికేషన్) నియంత్రణ బిల్లు, 20194. మధ్యవర్తిత్వ బిల్లు, 20235. జీవ వైవిధ్య (సవరణ) బిల్లు, 20226. మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు, 20227. రద్దు మరియు సవరణ బిల్లు, 20228. జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 20229. అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, 202310. రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (మూడవ సవరణ) బిల్లు, 2022 (హిమాచల్ ప్రదేశ్ కోసం)11. రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (ఐదవ సవరణ) బిల్లు, 202212. పోస్టల్ సర్వీసెస్ బిల్లు, 202313. నేషనల్ కో-ఆపరేటివ్ యూనివర్సిటీ బిల్లు, 202314. పురాతన కట్టడాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాలు (సవరణ) బిల్లు, 202315. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, 202316. అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు బ్యాంక్ బిల్లు, 202317. పన్నుల తాత్కాలిక సేకరణ బిల్లు, 202318. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, 202319. నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు, 202320. డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మెటిక్స్ బిల్లు, 202321. జననాలు మరియు మరణాల నమోదు (సవరణ) బిల్లు, 202322. జమ్మూ & కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 202323. సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు, 202324. ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 202325. న్యాయవాదుల (సవరణ) బిల్లు, 202326. గనులు మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) (సవరణ) బిల్లు, 202327. రైల్వేస్ (సవరణ) బిల్లు, 202328. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు, 202329. రాజ్యాంగం (జమ్మూ మరియు కాశ్మీర్) షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ (సవరణ) బిల్లు, 202330. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ (సవరణ) బిల్లు, 202331. రాజ్యాంగం (జమ్మూ మరియు కాశ్మీర్) షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ (సవరణ) బిల్లు, 2023
మణిపూర్ పై చర్చకు సిద్ధం
రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశంపై చర్చించేందుకు సిద్ధమని కేంద్ర బుధవారం ప్రకటించింది. వర్షాకాల సమావేశాల కోసం వివిధ అంశాలపై చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సమావేశమైన అఖిలపక్ష భేటీలో ఈ నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ప్రకటించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాన్‌సూన్ సెషన్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 11వ తేదీ వరకు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం స్పీకర్ ఆమోదించిన ప్రతి అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో, మణిపూర్ లో జరిగిన హింసాకాండపై చర్చించానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జోషి నొక్కి చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.