Andhra Pradesh Assembly Sessions Breaking News: ఐదేళ్లు ప్రతీకార రాజకీయాలు- గవర్నర్ ప్రసంగంలో కీలకాంశాలు ఇవే

Budget Session of Parliament Live Updates: 2024-25 బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తాజా సమాచారం కోసం ఈ పేజ్‌ను ఫాలో అవ్వండి. మంగళవారం సభలో నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.

Khagesh Last Updated: 22 Jul 2024 01:15 PM
అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎన్డీఏ సభ్యుల సమావేశం

అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ సభ్యుల సమావేశం. సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

Andhra Pradesh Assembly Sessions Breaking News: పెట్టుబడులు రాకపోగా ఉన్న సంస్థలను తరిమేశారు: గవర్నర్

Andhra Pradesh Assembly Sessions Breaking News: ఐదేళ్ల ప్రతిపార రాజకీయపాలనతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు గవర్నర్. పెట్టుబడులు రాకపోగా ఉన్నవి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని తెలిపారు. ప్రాజెక్టులపై మూలధన వ్యయాన్ని 56 శాతానికి తగ్గించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంది. 

Andhra Pradesh Assembly Sessions Breaking News: వైసీపీ నినాదాల మధ్యే సాగుతున్న గవర్నర్ ప్రసంగం 

Andhra Pradesh Assembly Sessions Breaking News: వైసీపీ సభ్యుల నినాదల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అశాస్ర్రీయ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందని గుర్తు చేశారు. 2014-19 మధ్య రాష్ట్రాభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఐదేళ్ల పాలన రివేంజ్ పాలన మాత్రమే సాగిందని గవర్నర్ వెల్లడించారు. వైసీపీ హయాంలో ప్రజల స్వేచ్ఛను లాగేసుకున్నారన్నారు.

Andhra Pradesh Assembly Sessions Breaking News: గవర్నర్ ప్రసంగానికి వైసీపీ అడ్డంకి- సేవ్ అంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు

Andhra Pradesh Assembly Sessions Breaking News: గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. నల్ల కండువాలతో వచ్చిన వైసీపీ సభ్యులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని రక్షించాలంటూ గట్టిగా నినదించారు. 

లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగు ఎంపీల ప్రశ్నలు అడుగుతున్న ప్రశ్నలు ఇవే

కేంద్ర పథకాల ద్వారా ఏపీకి అందిన నిధుల వివరాలు తెలపాలని కోరిన టీడీపీ ఎంపీలు దగ్గమళ్ల ప్రసాద రావు, కేశినేని శివనాథ్. కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ నిధులు ఇచ్చిందా అని మరో ప్రశ్న వేశారు.  ఆ నిధుల ఖర్చుపై రాష్ట్రప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) ఇచ్చిందా అంటూ మరో ప్రశ్న వేశారు. 
యువతకు శిక్షణ కోర్సులపై ప్రశ్నలు అడిగిన టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పుట్టా మహేశ్ కుమార్. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు కోరిన ఎంపీలు. జిల్లాలవారిగా ఆ నిధుల వినియోగం వివరాలు తెలపాలని కోరిన ఎంపీలు

Background

Budget Session of Parliament Live Updates: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లోనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఈ మధ్య కాలంలో చనిపోయిన ఎంపీలు, మాజీ ఎంపీలకు నివాళి అర్పిస్తారు. అనంతరం సభలో ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ సభకు సమర్పిస్తారు. 
ఈ పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్‌తోపాటు కీలకమైన బిల్లులు ప్రవేశ పెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అదే టైంలో ఈ మధ్య జరిగిన నీట్ పేపర్ లీక్, యూపీఎస్సీలోని పరిణామాలు, కేంద్రదర్యాప్తు సంస్థల దాడులు, రైల్వే ప్రమాదాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే ఛాన్స్ ఉంది. దీంతో సమావేశాలు హాట్‌ హాట్‌ జరిగేందుకు అవకాశం ఉంది. 


హాట్‌ హాట్‌గా సాగిన అఖిల పక్షం సమావేశం 


ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2024-25 బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తర్వాత రోజు బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. తర్వాత బడ్జెట్‌పై ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. వీటితోపాటు జీరో అవర్‌, ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. మరోవైపు సభలో కానీ, బయట కానీ సభాపతి రూలింగ్‌పై విమర్శలు చేయకూడదనే రూల్ తీసుకొచ్చారు. సభలో ఎలాంటి నినాదాలు చేయడానికి వీల్లేదు. ప్లకార్డులు కూడా ప్రదర్శించకూడదు. 
సభా సమావేశాలు ఎలా ఉంటాయో ఆదివారం జరిగిన ఆఖిలపక్ష సమావేశం చెప్పేసింది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో రాజ్‌నాథ్‌ సింగ్ ఆధ్వర్యంలో అఖిల పక్షం భేటీ అయింది. ప్రధానంగా నీట్ పేపర్ లీక్ అంశాన్ని విపక్షాలు ప్రధానంగా ప్రస్తావించాయి. దీనిపై సభలో చర్చించాలని డిమాండ్ చేశాయి. దీంతోపాటు దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని ఉసిగొల్పుతున్నారని దీనిపై కూడా చర్చకు కాంగ్రెస్ పెట్టుబట్టింది. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని దీనిపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. 


గత సమావేశాల్లో జరిగినవి రిపీట్ చేయొద్దని అధికార పార్టీ రిక్వస్ట్


గత పార్లమెంట్‌ సమావేశాల టైంలో జరిగిన కొన్ని అంశాలను రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. అలాంటివి రిపీట్ చేయొద్దని పార్టీలకు సూచించారు. సమావేశాలను సజావుగా హుందాగా నిర్వహించుకోవాలని అందుకు సహకరించాలని పార్టీలను కోరారు. ఈ ఆల్‌పార్టీ మీటింగ్‌లో 44 పార్టీలకు చెందిన 55 మంది నేతలు పాల్గొన్నారు. 


ఆరు కీలక బిల్లులు తీసుకురానున్న కేంద్రం 


ఈ పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన ఆరు బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. బ్రిటీష్ కాలంలో తీసుకొచ్చిన ఎయిర్‌ క్రాఫ్ట్ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో భారతీయ వాయుయాన్‌ విధేయక్‌-2024 పేరుతో కొత్త చట్టం తీసుకొస్తున్నారు. దీంతోపాటు విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లు, ఫైనాన్స్‌ బిల్లు, బాయిలర్స్‌ బిల్లు, కాఫీ ప్రోత్సాహం, అభివృద్ధి బిల్లు, రబ్బర్‌ ప్రోత్సాహం, అభివృద్ధి బిల్లును ఈ సమావేశాల్లో కేంద్రం సభ ఆమోదం పొందాలని భావిస్తోంది. 


Also Read: బడ్జెట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష భేటీ, కన్వార్ యాత్ర సహా పలు అంశాలపై చర్చ


Also Read: వచ్చే బడ్జెట్‌లో హ్యాపీ న్యూస్‌! - స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు పండగ చేసుకోవచ్చు


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.