Pakistan Drones: ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతుంటే, పాకిస్థాన్ మాత్రం తన దుష్ట చర్యలకు పాల్పడుతూనే ఉంది. నూతన సంవత్సరం మొదటి రోజు (జనవరి 1)న జమ్మ కశ్మీర్‌లోని పూంచ్ వద్ద పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా పేలుడు సామగ్రిని, కార్ట్రిడ్జ్‌లను పంపించింది. భారతదేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్ ఈ దుష్ట చర్యకు పాల్పడింది.
జమ్మూలోని పూంచ్ జిల్లాలో డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, కార్ట్రిడ్జ్‌లు నింపిన ప్యాకెట్లను వదిలారు. ఈ ప్యాకెట్లు దొరికిన తర్వాత సైన్యం అప్రమత్తమైంది. ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పాకిస్థాన్ డ్రోన్ లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలోని పూంచ్ ఖాడీ కర్మారా ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడినట్లు తెలిసింది.
ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు
భారత సైన్యం, జమ్మ కశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతంలో భారీ గాలింపు చర్యలు ప్రారంభించారు. అంతేకాకుండా, భద్రతా సంస్థలు డ్రోన్ల ప్రయాణ మార్గాన్ని పరిశీలిస్తున్నాయి. జమ్మ కశ్మీర్ ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) వాడకాన్ని నిషేధించింది. ఈ నిషేధం తర్వాత LOC సమీపంలో డ్రోన్ల కదలికలు కనిపించడం ఇది రెండోసారి.
భద్రతా బలగాల అప్రమత్తతతో డ్రోన్ల ద్వారా పంపిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో, దీని వెనుక ఏ ఉగ్రవాద నెట్‌వర్క్‌ల హస్తం ఉందో తెలుసుకునేందుకు భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
24 గంటల్లో రెండోసారి భారత్‌లోకి డ్రోన్ ప్రవేశం
భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో గత 24 గంటల్లో ఇది రెండోసారి డ్రోన్ కనిపించడం. అంతకుముందు సాంబాలోని ఫూల్‌పూర్ వద్ద అనుమానాస్పద డ్రోన్‌ను చూశారు. డ్రోన్ కొంత సమయం భారత భూభాగంలో ఉంది. అయితే, కొద్దిసేపటికే తిరిగి వెళ్లిపోయింది. డ్రోన్ కార్యకలాపాలను గమనించి, వెంటనే ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు ప్రారంభించారు.