Operation Sindoor: ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడులకు ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశాయి. కచ్చితమైన సమాచారం అర్థరాత్రి తర్వాత మెరుపుదాడులు చేసింది ఉగ్రశిబిరాలను తుక్కుతుక్కు చేశాయి.  

పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలపైనే భారత్‌ దాడి చేసింది. అక్కడ నుంచే ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రూపొందించి భారత్‌లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారు. 'ఆపరేషన్ సిందూర్' అనే సంకేతనామంతో రాత్రిపూట ఈ దాడులు జరిగాయి. మొత్తంగా తొమ్మిది ప్రదేశాలు లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. 

"కచ్చితమైన సమాచారం, ఫోకస్‌తో చర్యలు తీసుకున్నాం. ఇవి ఎలాంటి విపరిణామాలకు కూడా కారణం కావు. పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదు. లక్ష్యాల ఎంపిక, అమలు చేసే క్రమంలో భారత్‌ చాలా సంయమనాన్ని ప్రదర్శించింది" అని భారత్‌ తెలిపింది.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడుల తర్వాత పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు పర్యాటక ప్రదేశంలో 26 మంది పౌరులను కాల్చి చంపిన దాదాపు రెండు వారాల తర్వాత ఈ దాడులు జరిగాయి.

ప్రతి దాడి  చేస్తున్న పాకిస్థాన్  

భారతదేశం దాడులు నిర్వహించినట్లు ప్రకటించిన నిమిషాల తర్వాత, ఇండియన్ ఆర్మీ తన సోషల్ మీడియా ఖాతా Xలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని పోస్టు చేసి, "న్యాయం జరిగింది. జై హింద్" అని చెప్పింది. ఈ దాడులకు ప్రతిస్పందనగా పూంచ్-రాజౌరి ప్రాంతంలోని భింబర్ గాలిలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరిపిందని భారత సైన్యం తెలిపింది. దీనికి దీటుగానే స్పందిస్తున్నట్టు  తెలిపారు.

'ఆపరేషన్ సిందూర్' సమయంలో లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాల పేర్లను మాత్రం భారత్ ప్రకటించలేదు. తొమ్మిది ప్రాంతాల్లో దాడు చేసినట్టు మాత్రమే వెల్లడించింది.  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో "భారత్ మాతా కీ జై" అని పోస్టు చేశారు.  

రాజస్థాన్‌లో సైనిక విన్యాసాలు

భారత వైమానిక దళం పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాజస్థాన్‌లో రెండు రోజుల సైనిక విన్యాసాలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ విన్యాసాలు ఈరోజు రాత్రి 9:30 గంటలకు ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ముగుస్తాయి. థార్ ఎడారి ప్రాంతంలో అన్ని విమాన కార్యకలాపాలను నిలిపివేస్తూ వైమానిక దళ సభ్యులకు నోటామ్ లేదా నోటీసు జారీ చేశారు.