IAF used AI In Operation Sindoor | యుద్ధం గెలవాలంటే కేవలం బలం ఉంటే సరిపోదు. తెలివితేటలు కీలకపాత్ర పోషిస్తాయని మరోసారి రుజువైంది.  పాకిస్తాన్ తో జరిగిన వైమానిక దాడుల్లో భారత వైమానిక దళం (IAF) ఆర్టిఫీషియల్ ఇంజెలిజెన్స్ వాడి శత్రువులను దెబ్బకొట్టింది. మే 2025లో పాకిస్తాన్‌తో నాలుగు రోజుల సైనిక ఆపరేషన్‌లో భారత బలగాలు ఏఐని వినియోగించి ఫాక్ ను ఏ విధంగా ఫూల్స్ చేశాయో అమెరికా ఫైటర్ పైలట్ వెల్లడించారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ F-15E,  F-16 పైలట్ గా సేవలందిస్తున్న ర్యాన్ బోడెన్‌హైమర్, ఆపరేషన్ సిందూర్‌ను ఆధునిక వైమానిక పోరాటంలో సరికొత్త దశగా  అభివర్ణించారని idrw.org నివేదించింది. భారత్ కు చెందిన ఫైటర్ జెట్ రాఫెల్ గార్డ్  AI సాయంతో డెకాయ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పాకిస్తాన్ సైనిక దాడులను తిప్పికొట్టడంలో కీలకపాత్ర పోషించాడు.

Continues below advertisement

AI టెక్నిక్ తో పాక్‌ను దెబ్బకొట్టిన ఐఏఎఫ్ ‘X-గార్డ్ వ్యవస్థను రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ రూపొందించింది. ఇది 500 వాట్లు, 360 డిగ్రీల జామింగ్ సిగ్నల్‌ను జనరేట్ చేయడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. ఈ పరికరం 30 కిలోగ్రాముల బరువు ఉంటుంది. 100 మీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌పై విమానం వెనుక వెళుతుంది. దీని ప్రయోజనం ఏంటంటే ఇది అసలైన రాఫెల్ ఫైటర్ జెట్ రాడార్ సిగ్నల్స్ ను, డాప్లర్ ప్రభావాన్ని కాపీ చేస్తుంది. దాంతో శత్రువుల వైమానిక బలగాల అదే నిజమైన రాఫెల్ ఫైటర్ జెట్ అని భావించే అవకాశం ఉంది. అసలైనదా కాదా అని గుర్తించడం కష్టమవుతుంది. రాడార్ కు కనిపించిన ఏఐ జనరేటెడ్ ఫైటర్ జెట్ ఆకారాన్ని చూసి రాఫెల్ అని పాకిస్తాన్ వాయుసేన దాన్ని కూల్చివేసింది’ అని అమెరికా ఫైటర్ పైలట్ ర్యాన్ బోడెన్‌హైమర్ తెలిపారు. ఇంకా చెప్పాలంటే భారత ఐఏఎఫ్ ఫైటర్ చేసింది అత్యుత్తమ స్పూఫింగ్, చీటింగ్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

IDRW నివేదిక ప్రకారం చైనాలో తయారైన ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు (Air To Air Missiles), J-10C ఫైటర్ జెట్‌లతో యుద్ధం చేసిన పాకిస్తాన్ అసలైన భారత ఫైటర్  జెట్‌లను సరిగ్గా గుర్తించలేకపోయాయి. దాంతో అసలైన ఐఏఎఫ్ జెట్స్ ను పాక్ వాయుసేన టార్గెట్ చేయలేకపోయింది. ఈ డెకాయ్ శత్రు రాడార్‌ను తప్పుదారి పట్టించి క్షిపణి వ్యవస్థలను గందరగోళానికి గురిచేస్తుంది. చైనా PL-15 తరువాత వెర్షన్ అయిన PL-15E క్షిపణికి స్పూఫింగ్‌ను ఎదుర్కొనే సామర్థ్యం లేదు. భారత X-Guard పాకిస్తాన్ J-10C ఫైటర్ జెట్లపై ఉన్న KLJ-7A AESA రాడార్‌ను మిస్ లీడ్ చేశాయి. దాంతో పాక్ వాడిన చైనా ఫైటర్ జెట్స్ అసలైన రాఫెల్ జెట్‌లను టార్గెట్ చేసి ఢీకొట్టాయని పాక్ భావించి ఉండొచ్చు అని అమెరికా ఫైటర్ పైలట్ తెలిపారు.

Continues below advertisement

డెకాయ్ సిస్టమ్ మళ్లీ వినియోగించవచ్చు. అది  వేగవంతమైనది, నమ్మదగినది అని ప్రూవ్ అయింది. ఎక్స్ గార్డ్  AN/ALQ-50 లేదా ADM-160 MALD వంటి పాత US సిస్టమ్ కంటే వేగంగా పనిచేస్తుంది. కేవలం 2 సెకన్లలోపు ప్రయోగించవచ్చు. భారత ఫైటర్ జెట్లు అయిన రాఫెల్ ను కూల్చివేశామని పాక్ భావించడానికి ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఎక్స్ గార్డ్ డెకాయ్ సిస్టమ్ పై దాడి చేయడమే కారణమని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 

వైమానిక యుద్ధంలో కొత్త అధ్యాయంఎక్స్ గార్డ్ అనేది "డెకాయ్ వింగ్‌మ్యాన్" లాగా పనిచేస్తుంది, శత్రువుల కాల్పులు అసలైన ఫైటర్ జెట్ నుంచి దృష్టి మరళ్చి ఫేక్ ఫైటర్ జెట్ వైపు ఆకర్షిస్తుంది. ఫైబర్-ఆప్టిక్ లింక్ జామింగ్ పైలట్ ఇలాంటివి చేయవచ్చు. ఆపరేషన్ సిందూర్ లో భారత్ టెక్నాలజీతో పాక్ ను దెబ్బకొట్టిందని అమెరికా ఫైటర్ పైలట్ ర్యాన్ బోడెన్‌హైమర్ తెలిపారు. భవిష్యత్తులో వైమానిక యుద్ధాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏఐ లాంటి టెక్నాలజీ ద్వారా మోసం చేసి శత్రువులను దెబ్బ తీయడం తేలిక అవుతుందన్నారు.