Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి సీబీఐ దర్యాప్తులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి భారతీయ రైల్వేస్ లో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న అమీర్ ఖాన్, అతని కుటుంబంతో సహా ప్రమాదం జరిగిన తర్వాత నుంచి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే సోమవారం హడావుడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్న అధఇకారులు తాళం గమనించాకా.. సీల్ వేసి మరీ వెళ్లడం గమనార్హం. ఆపై సోరోలోని తెంటెయ్ ఛక్ లో ఉన్న బాహానాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి కూడా సీబీఐ అధికారులు వెళ్లారు. సిగ్నల్ జేఈ అయిన అమీర్ ఖాన్ బాలాసోర్ ప్రమాద ఘటన జరిగిన రీజియన్ లోనే పని చేస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి బాలాసోర్ రైలు ప్రమాద ఘనట జరగ్గా... రంలంగోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేశారు. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. 


అయితే ఈ ఘటన నుంచి ట్విట్టర్ లో బాలాసోర్ ప్రమాదం మళ్లీ ట్రెండ్ అవుతోంది. అందుకే జేఈ అమీర్ ఖాన్ కూడా ఓ కారణం. అతని గురించి వివరాలు తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. సోరోల్ అన్నపూర్ణ రైస్ మిల్లు దగ్గర అతని అద్దె ఇల్లు ఉంది. ఒడిశా రైరు ప్రమాదం తర్వాత అతని కదలికలపై నిఘా వేసిన సీబీఐ... అతని స్వస్థలం ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటనే విషయాలను గురించి తెలుసుకుంది. కానీ సీబీఐ ఇప్పటి వరకు ఈ విషయాలను వెల్లడించలేదు. 


రైలు ప్రమాద ఘటనలో కరెంట్ షాక్ తోనే 40 మంది మృతి



ఒడిశా రైలు ప్రమాద ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో కనీసం 40 మంది ప్రయాణికులు కరెంట్ షాక్ వచ్చే చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ప్రమాదం తర్వాత ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సిబ్బంది.. బోగీల నుండి మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఓ బోగీలో నుంచి దాదాపు 40 మృతదేహాలను బయటకు తీయగా.. వాటిపై ఎలాంటి గాయాలు అయిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడిందని, దీంతో విద్యుత్ షాక్ జరిగినట్లు రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై నుంచి వెళ్తున్న బెంగళూరు - హావ్ డా ఎక్స్‌ప్రెస్‌ కు.. కోరమాండల్ బోగీలు ఢీకొట్టడంతో ఆ రైలు వెనక ఉన్న పలు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఓవర్ హెడ్ లోటెన్షన్ లైన్ కరెంట్ వైర్లు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో కరెంట్ పాసై విద్యుదాఘాతం జరిగిందని రైల్వే పోలీసు అధికారులు చెబుతున్నారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial