New Parliament Inauguration Live: ఓంబిర్లాతో కలిసి నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
నేడు దేశానికి కొత్త పార్లమెంటు అందుబాటులోకి రాబోతోంది. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం మొదలైంది. తక్షణ అప్డేట్స్ ఇక్కడ పొందండి...
ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు.
కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతున్న సర్వమత ప్రార్థనా కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, క్యాబినెట్ మంత్రులతో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు.
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ హౌస్ లో సెంగోల్ ను ఏర్పాటు చేశారు.
సెంగోల్ కు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో చిన్న చిన్న విషయాలకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సెంగోల్ ను లోక్ సభ స్పీకర్ పోడియం సమీపంలో, సెంగోల్ పైభాగంలో నందిని తూర్పు-పడమర దిశలో ఉంచనున్నారు. సెంగోల్ ను ప్రతిష్ఠించిన అనంతరం ప్రధాని, లోక్ సభ స్పీకర్ చేతుల మీదుగా దీపం వెలిగించి సెంగోల్ పుష్పారాధన చేస్తారు.
ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న అధికారులు, మంత్రులు పార్లమెంట్ హౌస్ వస్తూనే ఉన్నారు. ఉదయం 7.15 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ హౌస్ కు చేరుకుంటారు.
- ఉదయం 7.30 - హవన్ మరియు పూజ
- ఉదయం 8.30 - సెంగోల్ స్థాపన
- ఉదయం 9 గంటలకు - ప్రార్థనా సమావేశం
- 12.07 - జాతీయ గీతం
- మధ్యాహ్నం 12.10: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రసంగం
- మధ్యాహ్నం 12.17: 2 షార్ట్ ఫిల్మ్‌ల ప్రదర్శన
- మధ్యాహ్నం 12.29: ఉపరాష్ట్రపతి ప్రసంగాన్ని చదవనున్నారు.
- మధ్యాహ్నం 12.33: రాష్ట్రపతి సందేశాన్ని చదవనున్నారు.
- మధ్యాహ్నం 12.38: ప్రతిపక్ష నేత ఖర్గే ప్రసంగం (బహిష్కరణ కారణంగా లేకపోవచ్చు)
- మధ్యాహ్నం 12.43 - స్పీకర్ ఓం బిర్లా ప్రసంగం
- మధ్యాహ్నం 1.05 - నాణెం విడుదల చేయనున్న ప్రధాని
- మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం
Background
ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు అంటే ఆదివారం (మే 28) ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7.30 గంటలకు పూజలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. పలు విపక్షాల బహిష్కరణ మధ్య అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరుకాబోమని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ప్రకటించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని విపక్షాలు అంటున్నాయి. కొత్త పార్లమెంటు భవనం ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉంటుందని ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోడీ అన్నారు. కొత్త భవనానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.
ఉదయం 7.30 గంటలకు హవన్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీని కోసం గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. అనంతరం ఉదయం 8.30 నుంచి 9.00 గంటల మధ్య తమిళనాడుకు చెందిన వెండితో చేసిన బంగారు పూత పూసిన చారిత్రాత్మక సెంగోల్‌ను లోక్ సభ స్పీకర్ పోడియం సమీపంలో ప్రతిష్ఠించనున్నారు. అధికార మార్పిడికి చిహ్నంగా 1947 ఆగస్టులో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన సెంగోల్‌ను అలహాబాద్ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో ఉంచారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం రూ.75 స్మారక నాణేన్ని విడుదల చేయనుంది.
పార్లమెంటు భవనం వైశాల్యం 64,500 చదరపు మీటర్లు. కొత్త పార్లమెంటులో లోక్ సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే వీలుంది. లోక్ సభ హాల్‌లో 1,272 మంది సభ్యులు కూర్చునే అవకాశం ఉంది. ప్రస్తుత పార్లమెంటు భవనం 96 సంవత్సరాల పురాతనమైనది, దీని నిర్మాణ పనులు 1927 లో పూర్తయ్యాయి. ప్రారంభోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రారంభోత్సవ టైంలో న్యూఢిల్లీ కంటైన్మెంట్ జోన్‌గాా పరిగణిస్తామని, వాహనాల ప్రవేశాన్ని పరిమితం చేస్తామని పోలీసులు ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. కొత్త పార్లమెంటు భవనం హై సెక్యూరిటీ జోన్ లో ఉంది. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా పెడుతున్నామని పోలీసులు తెలిపారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -