ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ హైమర్ బజ్ మామూలుగాలేదు. విడుదలైన ప్రతి చోటా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందీ సినిమా. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన అంశంపై తెరపైకి వచ్చింది. ఓపెన్ హైమర్‌కు క్రేజీ ఆఫర్ ఇచ్చారట అప్పటి ప్రధాని నెహ్రూ.  భారత పౌరసత్వం తీసుకోవాలని సూచించారట. 


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ హైమర్ సినిమా ఊపేస్తోంది. భాషలతో సంబంధం లేకుండా సినిమాను అభిమానించే వారితో పాటు విమర్శకులు సైతం క్రిస్టోఫర్ నోలన్ మెస్మరైజేషన్ కి ఫిదా అవుతున్నారు. ఇదే సమయంలో.. అటామిక్ బాంబు సృష్టికర్త ఓపెన్ హైమార్ కు 
భారత తొలి ప్రధాని నెహ్రు ఇచ్చిన ఓ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకు ఏమి జరిగిందంటే..? 


1945లో బాంబ్ కనిపెట్టిన ఓపెన్ హైమర్... రష్యా కోసం పని చేస్తున్నారనే ఆరోపణలపై 1954లో ఆయనను కోర్టుకు ఈడ్చారు. ఎవరి వల్ల ఐతే అమెరికా రెండో ప్రపంచం యుద్ధం గెలిచిందో... అతడి నిజాయితీనే అమెరికా ప్రశ్నించింది. ఈ సమయంలోనే అప్పటి ప్రధాని జవహర్ లాల్‌ నెహ్రూ ఓపెన్‌హైమర్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత పౌరసత్వాన్ని తీసుకుని ఇండియాలో పరిశోధనలు చేసుకోవాలని రిక్వస్ట్ చేశారట. 


ఏ బుక్‌ను ఐతే స్ఫూర్తిగా తీసుకుని డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ సినిమా తీశాడో.. ఆయన బుక్ కు సంబంధించి కో- ఆథర్ కై బర్డ్ ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఐతే.. నెహ్రు ఇచ్చిన ఆఫర్‌ను ఓపెన్‌ హైమర్ సీరియస్‌గా తీసుకోలేదట. ఎందుకంటే.. ఆయనకు అమెరికా అంటే చాలా ఇష్టం. సో.. ఓపెన్ హైమర్ సినిమా ఇండియాలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తున్న సమయంలో... నెహ్రూ ఆఫర్ న్యూస్ సినిమాకు మరింత హైప్ ఇస్తోంది.