NEET Re-Exam June 21: భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు సర్వం సిద్ధమైంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి చిన్న పొరపాటుకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా ఎగ్జామ్ పర్తి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, పరీక్షా ఏజెన్సీలు నడుం బిగించాయి. ఇందులో భాగంగానే జూన్ 21న జరగబోయే ఈ హైస్టేక్స్‌ ఎగ్జామ్‌ కోసం ముందెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా  ఉండేందుకు దేశవ్యాప్తంగా ఒక భారీ యుద్ధ విన్యాసాన్ని తలపించేలా ఒక మెగా మాక్ డ్రిల్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. 

Continues below advertisement

ఈ శనివారం జరగబోయే ఈ మాక్‌ డ్రిల్‌ సాధారణమైంది కాదు. పరీక్షా కేంద్రాల సన్నద్ధతను సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను, పర్యవేక్షణ యంత్రాంగాన్ని పూర్తిగా పరీక్షించడానికి రంగంలోకి ఏకంగా లక్షలాది మంది సిబ్బంది దిగుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది ఎగ్జామ్‌ సెంటర్లలో డిజిటల్ నెట్‌వర్క్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్స్, క్షేత్రస్థాయి ఏజెన్సీల మధ్య రియల్ టైమ్‌ కోఆర్డినేషన్ ఎలా ఉందో చెక్ చేయడానికి ఈ ప్రయోగానికి తెరలేపారు. విద్యార్థులు, తల్లిదండ్రులలో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఈ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేయడం దేశ విద్యా చరిత్రలోనే ఇదే తొలిసారి. 

శనివారం ఉదయం నుంచి 15 గంటలు...

ఈ నివేదిక ప్రకారం, శనివారం నిర్వహించబోయే ఈ నేషన్‌వైడ్‌ మాక్ డ్రిల్‌ కాలక్రమం అత్యంత ఆసక్తికరంగా మారబోతోంది. ఉదయం 9 గంటలకే కరెక్ట్‌గా ఈ డ్రిల్‌ ప్రారంభంకానుంది. అక్కడి నుంచి మొదలైన రోజంతా కొనసాగుతూ, అర్ధరాత్రి ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుంది. ంటే దాదాపు 15 గంటల పాటు ఈ మాక్ డ్రిల్ ఆపరేషన్ రన్ అవుతుంది. 

Continues below advertisement

ఈ టైంలో ఎగ్జామ్‌ రోజున ఎదురయ్యే ప్రతి ఒక్క క్లిష్ట పరిస్థితిని సృష్టించి సిబ్బంది అలర్ట్‌నెస్‌ను పరీక్షిస్తారు. క్వశ్చన్‌ పేపర్ల ట్రాన్స్‌పోర్టేషన్, డిజిటల్ లాక్‌ల ఓపెనింగ్‌ టైమింగ్స్, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్ సిస్టమ్‌ ఫెయిల్యూర్‌ అయితే ప్రత్యామ్నాయాలు, సెంటర్ల వద్ద జామర్స్ పనితీరును ఈ 15 గంటల విండోలో ప్రతి నిమిషం పర్యవేక్షిస్తారు. 

దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో భద్రత 

ఈ మాక్ డ్రిల్‌ స్కేల్‌, రేంజ్ చూస్తే మైండ్ బ్లాక్‌ అవ్వడం ఖాయం. ఈ శనివారం జరిగే మాక్ ఎగ్జామ్ కోసం దేశవ్యాప్తంగా ఏకంగా రెండు లక్షల యాభైవేల మందికిపైగా భద్రతా సిబ్బంది, అధికారులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఒక సాధారణ ప్రవేశ పరీక్ష కోసం ఇంత భారీ ఎత్తున రక్షణ సిబ్బందిని మోహరించడం ఒక రికార్డు. పరీక్షా కేంద్రాల లోపల, వెలుపల ఉండే ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, ఐటీ నిపుణులు, లోకల్‌ పోలీస్‌, సెంట్రల్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌  ఈ క్లోజ్డ్‌ లూప్ నెట్‌వర్క్‌ అటాక్స్‌ లేదా మాస్ కాపీయింగ్‌ వంటి మాల్ ప్రాక్టీసెస్‌కు ఎక్కడా చిన్న లూప్‌హోల్ కూడా లేకుండా ఈ సిబ్బందికి శనివారం లైవ్ ట్రైనింగ్, డ్రిల్ రన్ నిర్వహిస్తారు. 

పరీక్షా కేంద్రాల సన్నద్ధత

కేవలం భౌతిక భద్రత మాత్రమే కాదు, పరీక్ష నిర్వహించే వేదికల టెక్నికల్‌ ఆడిట్‌ కూడా ఈ డ్రిల్‌ ముఖ్య ఉద్దేశం. ప్రతి ఎగ్జామ్‌ సెంటర్‌లోని క్లాస్‌రూమ్‌లను న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కమాండ్‌ సెంటర్‌్కు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కనెక్ట్ చేస్తారు. జిల్లా కలెక్టర్స్‌, పోలీస్ కమిషనర్లు, నేషనల్ ఏజెన్సీల మధ్య ఎటువంటి అంతరాయం లేని హాట్‌లైన్‌లు కనెక్టివిటీని చెక్ చేస్తారు. ఎండల తీవ్ర దృష్ట్యా, ఆకస్మిక పవర్ కట్స్‌ తట్టుకునేందుకు సెంటర్‌లో యూపీఎస్‌, జనరేటర్ల బ్యాకప్‌లను లైవ్‌లో టెస్ట్ చేస్తారు.