Navy Helicopter Crash:
కేరళలోని కొచ్చిలో INS Garuda నేవల్ స్టేషన్ వద్ద చేతక్ హెలికాప్టర్ (Chetak Helicopter Crash) క్రాష్ అయింది. రన్‌వే పైనే క్రాష్ అయినట్టు సమాచారం. ట్రైనింగ్ ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఇంకా నేవీ అధికారికంగా స్పందించలేదు. లిఫ్టాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైనట్టు ప్రాథమిక సమాచారం అందింది. Manorama News ప్రకారం..రన్‌వేపై ఉన్న నేవీ అధికారికి చాపర్ రోటార్ బ్లేడ్స్ బలంగా తగలడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. నావల్ హెడ్‌క్వార్టర్స్‌లోని సంజీవని హాస్పిటల్‌కి తరలించి వీళ్లకు వైద్యం అందిస్తున్నారు. ట్రైనింగ్ జరుగుతుండగా మధ్యాహ్నం 2.30 నిముషాలకు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు.