India -Bhutan Railway Lines ఇప్పటికే కాశ్మీర్‌లో చీనాబ్ నది మీదుగా ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్, మీజోరాంలో తొలి రైల్వేలైన్ వంటి అద్భుతాలను సుసాధ్యం చేసిన ఇండియన్ రైల్వే మరో పెద్ద ప్రాజెక్ట్ చేపట్టింది. ఈసారి ఏకంగా ఇండియా -భూటాన్ దేశాల మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి రెడీ అవుతోంది. ఆ మేరకు రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అసోంలోని కొక్రాఝర్ (kokrajhar ) నుంచి భూటాన్‌లోని గెలెఫు (gelephu ) వరకూ, పశ్చిమ బెంగాల్‌లోని బనర్హత్ (Banarhat ) నుంచి భూటాన్‌లోని సమత్సే (Samtse) వరకూ రెండు లైన్లలో రైల్వే లైన్ నిర్మించబోతోంది ఇండియన్ రైల్వే. దీనివల్ల రెండు దేశాల మధ్య సరు రవాణా, ఆర్ధికపరమైన సంబంధాలే కాకుండా ఇరు దేశాల ప్రజల మధ్య బంధం మరింత పెరుగుతుందని రెండు దేశాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

Continues below advertisement

మొత్తం ఖర్చు రూ.4033 కోట్లు 

ఈ ప్రాజెక్ట్ కు అయ్యే ఖర్చు 4033 కోట్లు గా నిర్ధారించారు. దీనిలో కొక్రాఝర్ (ఇండియా ) నుంచి  గెలెఫు (భూటాన్ ) లైన్ కోసం  3,456 కోట్లు, బనర్హత్ (ఇండియా) నుంచి  సమత్సే (భూటాన్) లైన్ కోసం  577 కోట్లు కేటాయించారు. వీటిలో 'గెలెఫుని అడ్మినిస్ట్రేటివ్ సిటీగా వాల్యూస్ బేస్డ్ అర్బన్ డెవలప్మెంట్ సిటీగా భూటాన్ అభివృద్ధి చేస్తోంది. అలాగే 'సమత్సే ' సిటీని ఇండస్ట్రీయల్ సిటీగా డెవలప్ చేస్తోంది అక్కడి ప్రభుత్వం. భూటాన్ దేశం అభివృద్ధిలోనూ సంస్కృతిలోనూ భారతదేశం పెద్ద పాత్ర పోషిస్తోంది. ఆ దేశ అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలకు ఇండియా ఎంతో సహాయం చేస్తోంది. భూటాన్‌తో 700km పైగానే సరిహద్దు పంచుకుంటున్న భారత్‌తో సంబంధాలు భూటాన్‌కు ఎంతో ముఖ్యం. భూటాన్ దేశ వాణిజ్యం ఇండియన్ పోర్ట్స్ ద్వారానే జరుగుతోంది. దానికి క్రొత్తగా నిర్మిస్తున్న రైల్వే లైన్స్ చాలా ఉపయోగపడతాయని భారతీయ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Continues below advertisement

ఇండియా-భూటాన్ మధ్య ప్రాజెక్టుల కోసం 10,000కోట్లు ఇవ్వనున్న భారత్ 

భారత్‌కు అత్యంత సన్నిహిత దేశాల్లో భూటాన్ చాలా ముఖ్యం. 2024లో భూటాన్ వెళ్ళిన ప్రధాని మోదీ అక్కడి అత్యున్నత పౌరపురస్కారం డ్రుక్ గ్యాల్పో  ( Druk Gyalpo) స్వీకరించారు. అలాగే భూటాన్ రాజు జిగ్మే ఖేశర్ ఇప్పటికే పలుమార్లు భారత్ సందర్శించారు. ఆ పర్యటనల్లో భాగంగా 2024 నుంచి 2029 మధ్య రెండు దేశాల మధ్య నెలకొల్పే ప్రాజెక్ట్‌ల కోసం 10,000 కోట్లు కేటాయిస్తూ భారత ప్రభుత్వం ఒప్పందం చేసింది. అందులో భాగంగా ఈ ఇండియా-భూటాన్ రైల్వే లింక్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆ శాఖ మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఇవిగాక భూటాన్‌లో హైడ్రాలిక్ ప్రాజెక్ట్ సహా పలు పవర్ ప్రాజెక్ట్‌లను భారత్ ఏర్పాటు చేస్తోందని ఫారెన్ సెక్రటరే విక్రమ్ మిశ్రీ తెలిపారు.

4 ఏళ్లలో పూర్తి కానున్న ప్రాజెక్ట్ 

ఈ ప్రాజెక్ట్ రానున్న 4 ఏళ్లలో పూర్తి కానుంది. ఈ రెండు రైల్వే లైన్ లు పూర్తయితే వాణిజ్యం, రవాణాతోపాటు టూరిజంపరంగా ఇండియా-భూటాన్. మధ్య సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. ఇప్పటికే భారత్ తన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌తో రైల్ రూట్ కలిగి ఉన్నప్పటికీ వాటన్నిటి కంటే దౌత్యపరంగా ఎలాంటి సమస్యలు లేని దేశం భూటాన్. అయితే అత్యంత సుందర దృశ్యాలతోపాటు ఎంతో కష్టసాధ్యమైన ప్రాంతాల గుండా ఈ రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంటుంది. కానీ కాశ్మీర్ చినబ్ వంతెన, మీజోరామ్ రైల్వేలైన్ లాంటి అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ ప్రతిభకు ఇదో సమస్య కాదని అధికారులు చెబుతున్నారు.