MiG-21 Fighter Jet Crash : భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లా సమీపంలో మిగ్-21 కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. బర్మార్ సమీపంలో గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని భారత వాయుసేన ధ్రువీకరించింది.  విమానం కూలిన సమయంలో పెద్దఎత్తున మంటలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 













ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్‌ వీఆర్‌ చౌదరితో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు. పైలెట్ల మృతి పట్ల రక్షణ మంత్రి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మిగ్‌-21 ప్రమాదం జరిగి పైలెట్లు మృతిచెందడంపై ఎయిర్ ఫోర్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల కారణాలపై కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీని ఆదేశించినట్లు తెలిపింది.